బ్రటిస్లావా నుండి వచ్చే రోడ్డు (ఎటు వైపు?) -ద హిందూ ఎడిట్…

– [ఈ రోజు ద హిందూ ‘The road from Bratislava’ శీర్షికన  ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతథ అనువాదం] ఒకటి తక్కువ 28 ఈయూ దేశాలు బ్రెగ్జిట్ అనంతర ప్రపంచం గురించి చర్చించడానికి సమావేశమైన బ్రటిస్లావా భవంతిలో ఐక్యత, పొందికల లేమి సుస్పష్టంగా వ్యక్తం అయింది. ఏ ఒక్కరూ ఎలాంటి భ్రమలకూ తావు ఇవ్వటం లేదు. ఈయూ ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్…

పొదుపు విధానాలపై ఆందోళనలతో అట్టుడుకుతున్న యూరప్ -ఫోటోలు

గత రెండున్నర సంవత్సరాలుగా యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలు దాదాపు అన్నివర్గాల ప్రజలను వీధుల్లోకి తెస్తున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రవేటీకరణ వల్ల లక్షలాది ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోత విధించారు. పెన్షన్లను కూడా వదలకుండా దోచుకుంటున్నారు. వేతనాలు కోత పెట్టడమే కాకుండా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమ సదుపాయాలను కూడా రద్దు చేస్తున్నారు. దానితో ఆరోగ్య భద్రత కరువై వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒకవైపు వేతనాలు తగ్గిస్తూ మరోవైపు పన్నులు…

యూరప్ రుణ సంక్షోభాన్ని ప్రపంచానికి అంటించొద్దు -అమెరికా తదితరులు

శుక్రవారం, జి20 గ్రూపు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ప్రధాన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ దేశాలు సభ్యులుగా ఉన్న ఈ గ్రూపు సమావేశాల సందర్భంగా యూరప్ రుణ సంక్షోభం పరిష్కరించే బాధ్యతను ప్రపంచ దేశాలపై వేయడానికి యూరప్ దేశాలు (ఇ.యు) చేసిన ప్రయత్నాన్ని అమెరికా తదితర దేశాలు తిప్పికొట్టాయి. యూరప్ రుణ సంక్షోభాన్ని యూరప్ దేశాలే పరిష్కరించుకోవాలనీ, ప్రపంచానికి అంటించాలనుకోవడం సరికాదని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు వాదించాయి. యూరప్ రుణ సంక్షోభం…

జి7, యూరోజోన్‌ల వైఫల్యంతో ప్రపంచ స్ధాయిలో షేర్ల పతనం

శుక్రవారం జరిగిన జి7 గ్రూపు దేశాల సమావేశం యూరోజోన్ సంక్షోభం పరిష్కారానికి ఏ విధంగానూ ప్రయత్నించకపోవడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. యూరోజోన్ దేశాల్లో, ముఖ్యంగా జర్మనీకీ ఇతర దేశాలకీ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడం కూడా షేర్ మార్కెట్లపై ప్రపంచ స్ధాయి ప్రభావం పడుతోంది. జపాన్ షేర్ మార్కెట్ నిక్కీ గత రెండున్నర సంవత్సరాలలోనే అత్యల్ప స్ధాయికి పడిపోయింది. భారత షేర్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచి మళ్ళీ పదాహారు వేల పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,…

బ్రిటన్‌ యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, అల్లర్లకు అదే కారణం

బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం అక్కడ నిరుద్యోగం భూతం జడలు విప్పింది. ప్రభుత్వరంగం ఉద్యోగులను తొలగిస్తుండంతో పాటు ప్రవేటు రంగ ఉత్పత్తి స్తంభించిపోవడంతో నిరుద్యోగం పెరుగుతున్నదని భావిస్తున్నారు. లండన్ తో పాటు ఇతర నగరల్లోని పేద కుటుంబాల యువకులు కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడిన నేపధ్యంలో వెలువడిన ఈ వివరాలు అల్లర్లకు కారణమేమిటో చెప్పకనే చెపుతున్నాయి. రాజకీయ నాయకులు, కార్పొరేట్ మీడియా కూడబలుక్కుని అల్లర్లకు, నిరుద్యోగం కారణం కాదంటూ నమ్మబలుకుతున్నప్పటికీ వాస్తవాలు…

కొత్త ప్రమాదం ముంగిట ప్రపంచ మార్కెట్లు -ప్రపంచ బ్యాంకు

గత కొద్ది వారాలుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచ మార్కెట్లను కొత్త ‘డేంజర్ జోన్’ ముంగిట నిలిపాయని ప్రపంచ బ్యాంకు అధిపతి రాబర్ట్ జోయెలిక్ హెచ్చరించాడు. 1. అమెరికా, యూరప్ ల లాంటి కీలక దేశాల్లో ఆర్ధిక నాయకత్వంపై మార్కెట్ విశ్వాసం సన్నగిల్లడం, 2. పెళుసైన ఆర్ధిక రికవరీ… ఈ రెండు అంశాలు కలిసి మార్కెట్లను కొత్త ప్రమాదంలోకి నెట్టాయని ఆయన వ్యాఖ్యానించాడు. వివిధ దేశాల్లోని విధాన కర్తలు దీనిని తీవ్రంగా పరిగణించాలని జోయెలిక్ కోరాడు. సిడ్నీలో ఆదివారం…