చైనాను అప్పడిగిన ఇటలీ

మరే ఇతర దేశం కన్నా అమెరికాకి అత్యధిక అప్పు ఇచ్చిన చైనాను ఇటలీ కూడా అప్పు అడిగింది. తన సావరిన్ అప్పు బాండ్లను కొనుగోలు చేయవలసిందిగా ఇటలీ చైనాను కోరింది. ఇటలీ బాండ్లను పెద్ద ఎత్తున చైనాచేత కొనుగోలు చేయించడం ద్వాగా గాడి తప్పుతున్న తన ఆర్ధిక వ్యవస్ధను దారిలో పెట్టాల్ని ఇటలీ భావిస్తున్నది. పెట్టుబడిదారీ ప్రభుత్వాలు, నిర్ధిష్ట కాల పరిమితితో ‘సావరిన్ డెట్ బాండ్లు’ జారీ చేయడం ద్వారా అప్పు సేకరిస్తాయన్న సంగతి తెలిసిందే. అప్పు…