పంట రుణాల రద్దు కాదు, రీ షెడ్యూల్ మాత్రమే!

వ్యవసాయ, డ్వాక్రా రుణాల రద్దుకు హామీ ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఆర్.బి.ఐ నుండి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ప్రకారం రైతు, డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేసేందుకు ఆర్.బి.ఐ సుముఖంగా లేదు. కేవలం రీషెడ్యూల్ మాత్రమే చేయడానికి అంగీకరించింది. అది కూడా షరతులతో. విచిత్రంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రీ షెడ్యూల్ మాత్రమే కోరినట్లు ఆర్.బి.ఐ సమాచారం బట్టి అర్ధం అవుతోంది. పంట రుణాల రీ షెడ్యూల్ ప్రతిపాదనలకు సూత్రబద్ధంగా ఆమోదం…