దేశ రాజధాని సమీపంలో పరువు హత్య, హత్యా ప్రయత్నం

ప్రేమించిన పాపానికి తండ్రీ, సోదరులే హత్యలకు సిద్ధపడ్డారు. భారత దేశ రాజధాని న్యూఢిల్లీ కి సమీపంలోనే శనివారం రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. తమ ఊరిలోనే వేరొక వ్యక్తిని ప్రేమించినందుకు తన కూతురిని తండ్రే ఉరి బిగించి చంపగా, అక్కడికి సమీపంలోని మరో ఊరిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి సోదరుడు కాల్పులు జరిపాడు. భార్యా, భర్తలు ఇరువురూ ఆసుపత్రిలో తేరుకుంటున్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ శివార్లలోని సోనిపట్ లో నివసిస్తున్న బ్రజేష్ సింగ్ కి 12…