సి.ఆర్.ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లు అంటే?

ప్రశ్న: రెపో  రేటు, రివర్స్ రెపో రేటు గురించి వివరించగలరా? జవాబు: ఈ ప్రశ్నకు సమాధానం వివిధ సందర్భాల్లో వివరించాను. కానీ అలాంటి సందర్భం మళ్ళీ వస్తే గుర్తు తెచ్చుకోడానికి పాఠకులకు ఇబ్బంది ఉన్నట్లు కనిపిస్తోంది. బహుశా వివరణలో కాకుండా, టపాలోనే ఈ పేర్లు ఉన్నట్లయితే వెతుక్కోడానికి కొంత సులభంగా ఉండవచ్చని మళ్ళీ వివరిస్తున్నాను. గతంలో ఇచ్చిన వివరణను విస్తృతం చేస్తున్నాను. రిజర్వ్ బ్యాంకు నియంత్రణలో ఉండే వడ్డీ రేట్లను దేశంలో ద్రవ్య చలామణిని అదుపులో ఉంచడానికి…

ఆర్ధిక వృద్ధికి నష్టమైనా, వడ్డీ రేట్ల పెంపుకే మొగ్గు చూపిన ఆర్.బి.ఐ

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సారి వడ్డీ రేట్లను పెంచింది. జూన్ 16న చేపట్టిన ద్రవ్య పరపతి విధానం సమీక్షలో ఆర్.బి.ఐ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే అప్పులపై వసూలు చేసే వడ్డీ రేటు) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రివర్స్ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద డిపాజిట్ చేసిన డబ్బుపై ఇచ్చే వడ్డీ రేటు) కూడా 0.25 శాతం పెంచింది. వడ్డీ రేట్ల పెంపుదల…