రిలయన్స్ పై మరో 3.5 వేల కోట్ల జరిమానా

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పై కేంద్రం మరో 579 మిలియన్ డాలర్ల (సుమారు రు. 3.5 వేల కోట్లకు సమానం) జరిమానా విధిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ చమురు సహజవాయువు మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఈ సంగతి తెలిపారు. 2013-14 సంవత్సరంలో కాంట్రాక్టు మేరకు సహజవాయువు ఉత్పత్తి చేయనందుకు గాను ఈ జరిమానా విధించామని చెప్పారు. దీనితో రిలయన్స్ కంపెనీపై విధించామని కేంద్రం చెప్పిన జరిమానా మొత్తం…

రిలయన్స్ గ్యాస్: యు.పి.ఏ ధర పెంపుకు ఎన్.డి.ఏ కోత

ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్మూలను అనుసరిస్తూ రిలయన్స్ కంపెనీ వెలికి తీస్తున్న గ్యాస్ ధరను యు.పి.ఏ రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. సదరు పెంపును తగ్గిస్తూ ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సి.రంగరాజన్ రూపొందించిన ఫార్ములాను ఆమోదించడానికి ఎన్.డి.ఏ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎంతకాలం అమలులో ఉంటుందో వేచి చూడాల్సిన విషయం. కె.జి. బేసిన్ లో గ్యాస్ వెలికి తీస్తున్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్…

రైతులకు మోడి వాత, యూరియా ధర పెంచే యోచన

బహుళ బ్రాండు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను పరోక్షంగా ప్రవేశపెట్టనున్న మోడి ప్రభుత్వం అదే ఊపుతో రైతులకు నేరుగానే వాత పెట్టేందుకు యోచిస్తోంది. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు తగిన విధంగా రుణం తీర్చుకోవడానికి మోడి ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు మేలు చేయడం కోసం గ్యాస్ ధరలను రెట్టింపు చేసినందున పెరగనున్న సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి యూరియా ఎరువు ధరను కనీసం 10 శాతం పెంచేందుకు యోచిస్తోంది. ఈ…

ఎఎపి పాలన: షీలా అవినీతిపై విచారణ!

బైటి నుండి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పైకి ఢిల్లీ ప్రభుత్వం మరో అస్త్రం సంధించింది. కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వివిధ నిర్మాణాల్లోని అవినీతిని విచారించాలని రాష్ట్ర ఎ.సి.బిని ఆదేశించింది. సాధారణంగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలను సంతృప్తిపరచడానికీ, వారు అలిగినప్పుడు ప్రసన్నం చేసుకోవడానికీ, వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి పాలక పార్టీలు నానా అగచాట్లు పడుతుంటాయి. కానీ ఎఎపి పార్టీ ఈ విషయంలోనూ ‘నేను తేడా’ అని చెబుతోంది. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్…

11,375 కోట్ల రూపాయలు నష్టపోయిన అనీల్ అంబానీ కంపెనీలు

  బుధవారం ప్రతికూల పుకార్ల కారణంగా అనీల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు 2.5 బిలియన్ల డాలర్ల మార్కెట్ కేపిటల్ నష్ట పోయినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ గురువారం తెలిపింది. బుధవారం ఇండియా షేర్ మార్కెట్లు ఎనిమిది నెలల కనిష్ట స్ధాయికి పతనమయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావటంతో విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇండియా షేర్ల నుండి ఉపసంహరించుకుంటున్నందువలన షేర్లు అడ్డూ అదుపూ లేకుండా పతనమవుతున్నాయి. ఈ నేపధ్యంలో అనీల్ అంబానీ…