ముంబైకి రిలయన్స్ ఎగేసిన బాకీ రు 1577 కోట్లు!

ముంబై మునిసిపాలిటీకి ఐదేళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ చెల్లించవలసిన బాకీని చెల్లించని ఉదంతం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డవలప్మెంట్ ఆధారిటీ (ఎం‌ఎం‌ఆర్‌డి‌ఏ) కి చెందిన రెండు స్ధలాలను లీజుకు తీసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ, లీజు ద్వారా తలెత్తిన చెల్లింపులను ఎగవేసినట్లు లేదా ఇంతవరకు చెల్లించనట్లుగా ఒక ఆర్‌టి‌ఐ కార్యకర్త వెల్లడి చేశాడు. అక్రమ కట్టడం పేరుతో, ఆక్రమణ పేరుతో పేదల గుడిసెలను పెద్ద ఎత్తున తొలగించి…

లోతుల నుండి -ది హిందు ఎడ్

ఏప్రిల్ 4, 2016 నాటి ది హిందు సంపాదకీయం ‘Out of depth’ శీర్షికన ప్రచురితం అయిన సంపాదకీయంకు యధాతధ అనువాదం. –విశేఖర్ ********* చమురు మరియు సహజవాయు అన్వేషణ, ముఖ్యంగా లోతైన జలాల్లో (డీప్ వాటర్), ప్రమాదకర వ్యాపారం. అత్యున్నతమైన ఆద్యునిక సాంకేతిక పరిజ్ఞానం దానికి కావాలి; కనుక భారీ మొత్తంలో నిధులూ అవసరమే. తగిన సాంకేతిక పరిజ్ఞానం, సరిపడా నైపుణ్యం తోడు లేకుండా సంపద తవ్వి తీయాలని భావిస్తే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్…

రిలయన్స్ చేతిలో ఐ.బి.ఎన్ ఛానెళ్లు, ఎడిటర్ల రాజీనామా

నెట్ వర్క్ 18 మీడియా గ్రూపుకు చెందిన మీడియా ఛానెళ్లు రిలయన్స్ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆ గ్రూపులోని వివిధ ఛానెళ్ల ఎడిటర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. రిలయన్స్ యాజమాన్యం ఎడిటోరియల్ విధానంలోనూ, న్యూస్ కవరేజీ లోనూ జోక్యం చేసుకోవడం పెరగడంతో తాను రాజీనామా చేయక తప్పలేదని ఒక ఎడిటర్ చెప్పగా అదే విషయాన్ని మరో ఎడిటర్ పరోక్షంగా సూచించారు. భారత చట్టాలను ఎగవేస్తూ ప్రభుత్వం విధించే కోట్ల రూపాయల అపరాధ రుసుములను ఎగవేయడంలోనూ అగ్రభాగాన ఉన్న…

ఎఎపి పాలన: అంబానీ లైసెన్స్ రద్దుకు సిఫారసు

ఢిల్లీ ప్రభుత్వం అన్నంత పనీ చేస్తోంది. జనానికి సబ్సిడీ ధరలకు విద్యుత్ ఇవ్వడానికి నిర్ణయించిన ఎఎపి ప్రభుత్వం వాస్తవ విద్యుత్ పంపిణీ ఖర్చులను నిర్ధారించుకోడానికి ప్రైవేటు డిస్కంలపై కాగ్ ఆడిట్ చేయించాలని నిర్ణయించడంతో అంబానీ, టాటా కంపెనీలు సహాయ నిరాకరణకు దిగిన సంగతి తెలిసిందే. తొండి కారణాలు చెప్పి విద్యుత్ సరఫరా బంద్ చేయడానికి వీలు లేదనీ, అలా చేస్తే డిస్కంల లైసెన్స్ లను రద్దు చేయడానికి కూడా వెనుకాబడబోమని సి.ఎం ఎ.కె హెచ్చరించినట్లుగానే మొదటి వేటు…

రిలయన్స్-మంత్రుల్ చెట్టపట్టాల్ -కార్టూన్

కేశవ్ గారి మేజికల్ అప్పీల్ కి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? భారత దేశ రాజకీయ నాయకులు ఈ దేశంలోని అత్యంత ధనికుడుగా పేరు పొందిన వ్యక్తి, రిలయన్స్ కంపెనీ అధినేత అయిన ముఖేష్ అంబానీతోనూ, ఆయన కంపెనీ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ తోనూ పాలు-నీళ్ళు లాగా ఎంతగా కలిసిపోయారో చెప్పగల ఇలస్ట్రేషన్ ఇంతకు మించి ఉంటుందా? ఒకవేళ అర్ధం కాకపోతే ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ కంపెనీ లోగోనూ, ఈ కార్టూన్ నూ పక్క పక్కనే పెట్టి చూస్తే మర్మం…

బొగ్గు కుంభకోణంలో మీడియా, మాయమవుతున్న ఫోర్త్ ఎస్టేట్

2జి కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మీడియా బొగ్గు కుంభకోణంలో నేరుగా లబ్ది పొందినట్లు సి.బి.ఐ పరిశోధనలో వెల్లడైంది. నాలుగు మీడియా కంపెనీలు అక్రమ లబ్ది పొందాయని ‘ది హిందూ’ చెప్పినప్పటికీ పేర్లు వెల్లడించలేదు. నెట్ వర్క్ 18 (ఐ.బి.ఎన్ గ్రూపు), డి.బి కార్ప్ (డెయిలీ భాస్కర్ గ్రూపు) లు లబ్ది పొందిన మీడియా కంపెనీల్లో ఉన్నాయని ఫస్ట్ పోస్ట్ తెలిపింది.  తమకు కేటాయించిన బొగ్గు గనులనుండి కంపెనీలు అక్రమ లబ్ది పొందాయన్న ఆరోపణలపై సి.బి.ఐ విచారణ…

క్లుప్తంగా… 02.05.2012

జాతీయం   రిలయన్స్ ని అధిగమించిన టాటా కన్సల్టెన్సీ బుధవారం షేర్ మార్కెట్లు ముగిసేనాటికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ (టి.సి.ఎస్) అత్యధిక విలువ గల కంపెనీగా అవతరించింది. ‘మార్కెట్ క్యాపిటలైజేషన్’ ప్రకారం ఇప్పుడు టి.సి.ఎస్ అతి పెద్ద కంపెనీ. గత అయియిదేళ్లుగా రిలయన్స్ కంపెనీ ఈ స్ధానంలో కొనసాగుతూ వచ్చింది. బుధవారం ట్రేడ్ ముగిసేనాటికి టి.సి.ఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రు. 2,48,116 కోట్లు కాగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రు. 2,43,413 కోట్లు. బుధవారం ఆర్.ఐ.ఎల్…

కాంట్రాక్టు నిబంధనలను రిలయన్స్ ఉల్లంఘించింది -కాగ్ అక్షింతలు

భారత దేశ రాజ్యాంగసంస్ధ, ప్రభుత్వ ఉన్నత ఆడిటింగ్ సంస్ధ అయిన ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాంట్రాక్టు ఉల్లంఘనలపై తన పూర్తి నివేదికను గురువారం సమర్పించింది. ఈ నివేదికలో కేంద్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండింటినీ కాగ్ విమర్శించింది. కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీకీ, రిలయన్స్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించేలా సహకరించినందుకు ప్రభుత్వానికీ అక్షింతలు వేసింది. దేశానికి చెందిన కీలకమైన ఆయిల్ వనరు కృష్ణ-గోదావరి (కె.జి) బేసిన్ అభివృద్ధి చేసే కాంట్రాక్టు రిలయన్స్ ఇండస్ట్రీస్…

మార్కెట్ హెవీ వెయిట్ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ రేటింగ్ తగ్గింపు

భారత షేర్ మార్కెట్‌కు హెవీ వెయిట్ గా పేరుపొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను వాల్‌స్ట్రీట్ స్ట్రీట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తగ్గించేసింది. పెట్టుబడి ఎక్కువ చేసి చూపిందని ఆరోపణ ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చుట్టూ ఇటీవల అనేక ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. గ్యాస్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయని భావిస్తున్న కెజి బేసిన్ లో అనుకున్నంత స్ధాయిలో నిల్వలు లేవన్న అనుమానాలు తలెత్తాయి. సమీప భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీట్ కంపెనీకి అనుకూలంగా పనిచేసే పరిణామాలేవి సంభవించవని మోర్గాన్ స్టాన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్…