కేబినెట్ నిర్ణయం దేశానికి, ప్రధాని సంతకం అమెరికాకి

భారత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాన్ని పక్కకు నెట్టి విదేశాలకు మేలు చేసే నిర్ణయాలను అంతర్జాతీయ వేదికలపై ఒప్పుకుని వచ్చే దేశాధినేతలు ఎక్కడయినా ఉంటారా? మనం ఆ అదృష్టం చేసుకున్నాం. గ్లోబల్ వార్మింగ్ కు దారి తీస్తున్న వాయువుల విడుదలను అరికట్టే విషయంలో ‘అంతర్జాతీయ ధరిత్రి వేదిక’లపై అమెరికా, ఐరోపాల పెత్తనాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపించే ప్రధాని మన్మోహన్ తీరా ఆచరణలోకి వచ్చేసరికి అమెరికా ఒత్తిడికి లొంగి దేశ ప్రయోజనాలను గంగలో కలిపే ఒప్పందంపైన సంతకం చేసిన దారుణానికి ఒడిగట్టారు.…