బ్రెగ్జిట్ అద్భుతం: ఈ‌యూతో విడాకులకే బ్రిటిష్ ఓటు (విశ్లేషణ)

బ్రిటన్ ప్రజలు అనూహ్య ఫలితాన్ని ప్రపంచం ముందు ఉంచారు. యూరోపియన్ యూనియన్ తో విడిపోవటానికే మా ఓటు అని చాటి చెప్పారు. జూన్ 23 తేదీన గురువారం జరిగిన రిఫరెండంలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్ కే ఓటు వేశారు. 51.9 శాతం మంది బ్రెగ్జిట్ (లీవ్ ఈ‌యూ) కు ఓటు వేయగా 48.1 శాతం మంది ఈ‌యూలో కొనసాగాలని (రిమైన్) ఓటు వేశారు. 3.8 శాతం మెజారిటీతో బ్రెగ్జిట్ పక్షాన నిలిచారు. తద్వారా దశాబ్దాలుగా అమెరికా తమపై…

రేపే బ్రెగ్జిట్ రిఫరెండం!

ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు మలుపు, కుదుపు కాగల మార్పులకు దారి తీసే అవకాశం ఉన్న ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ఉరఫ్ రిఫరెండం రేపు, జూన్ 23 తేదీన, బ్రిటన్ లో జరగనున్నది. “యూ‌కే, యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలా లేక బైటికి రావాలా?” అన్న ఏక వాక్య తీర్మానంపై జరిగనున్న రిఫరెండంలో విజేతగా నిలవటానికి ఇరు పక్షాలు సర్వ శక్తులూ ఒడ్డాయి. గెలుపు ఇరువురు మధ్యా దొబూచులాడుతోందని సర్వేలు చెప్పడంతో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. యూ‌కే రిఫరెండంలో యూ‌కే…

ఈ‌యూ ఆధిపత్యం నిలువరించే ఆయుధం: రిఫరెండం

రిఫరెండం అంటే భారత పాలకవర్గాలకు ఎనలేని భయం. వారికి జనం అభిప్రాయాల పట్ల అస్సలు గౌరవం ఉండదు. జనం గొర్రెలు అని వారి నిశ్చితాభిప్రాయం. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి జనం అభిప్రాయాలు కావాలి. అభిప్రాయాలూ అంటే అభిప్రాయాలు కాదు. ఓటు ద్వారా వ్యక్తం అయ్యే వారి ఆమోదం మాత్రమే కావాలి. ఆ ఓటు సంపాదించడానికి ఎన్ని జిత్తులు వేయాలో అన్నీ వేస్తారు. ఆనక వారిని నట్టేట్లో వదిలేసి పోతారు. ఐరోపా దేశాల్లో అలా కాదు. రిఫరెండం…