రిపబ్లిక్ డే డాలరీకరణ! -కార్టూన్

స్వదేశీ నినాదం తమదిగా బి.జె.పి చెప్పుకుంటుంది. బి.జె.పి మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ లో ఆర్ధిక విభాగం పేరే ‘స్వదేశీ జాగరణ్ మంచ్.’ విదేశాలకు, ముఖ్యంగా అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించాలని ఈ సంస్ధ అనేక దశాబ్దాలు పుస్తకాలు ప్రచురించి మరీ బోధించింది, ఇంకా బోధిస్తోంది. అలాంటి స్వదేశీ బి.జె.పి తీరా అధికారానికి వచ్చాక పక్కా విదేశీ విధానాలను కాంగ్రెస్ కంటే ఎక్కువగా వాటేసుకుని అమలు చేయడాన్ని ఎలా అభివర్ణించాలి? ప్రపంచ దేశాలపై పెత్తనం చేసే…

భద్రతపై విభేదాలు, ఒబామా ఆగ్రా పర్యటన రద్దు

అమెరికా అధ్యక్షుడి ఆగ్రా పర్యటన రద్దయిందని భారత అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు తన భార్య మిచెల్లే ఒబామాతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శిస్తారని ఇప్పటివరకు ఇరు దేశాలు విడుదల చేసిన షెడ్యూళ్ళు చెబుతూ వచ్చాయి. కానీ ఆగ్రా పర్యటన సందర్భంగా ఒబామా భద్రత కోసం తీసుకోవలసిన చర్యల విషయమై భారత భద్రతా బలగాలకు, అమెరికా భద్రతా బలగాలకు స్వల్ప విభేదాలు తలెత్తడంతో ఒబామా తన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 24వ…