చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ, మమత బెనర్జీ వంచనా శిల్పం
చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇంతకాలం చెబుతూ వచ్చిన మమత బెనర్జీ తన ఉద్దేశాలు వేరే ఉన్నాయని వెల్లడి చేసుకుంది. పార్లమెంటు సమావేశాల మొదటిరోజునే, సాధ్యంకాని అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించి భంగపాటుకు గురయినట్లు దేశ ప్రజలకు సందేశం ఇచ్చిన త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక సమయంలో వెన్ను చూపుతోంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతించే బిల్లుపై ఓటింగ్ కు ప్రతిపక్షాలు పట్టుపడుతుండగా, ఓటింగ్ అవసరం లేకుండా చేసే కుట్రలో కాంగ్రెస్ కు సహకారం…