వైవిధ్యానికీ, బహుళ గొంతుకలకూ జేఎన్యూ వేదిక

(ప్రముఖ పాత్రికేయులు, వ్యవసాయరంగ నిపుణులు, ‘రామన్ మెగసెసే’ అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ జేఎన్యూ ఉద్యమానికి మద్దతుగా గత 19న విద్యార్థులనుద్దేశించి క్యాంపస్లో ప్రసంగించారు. ఆ ప్రసంగానికి పూర్తిపాఠం ఇది.) *****అనువాదం: జి వి కే ప్రసాద్ (నవ తెలంగాణ)***** నేను జేఎన్యూ పూర్వ విద్యార్థిని కావడం నాకు గర్వకారణం. 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేసిన కొద్ది కాలానికే నేనీ క్యాంపస్లో అడుగుపెట్టాను. ఆ రోజుల్లో పురుషుల ‘గంగా’ హాస్టల్ రాజకీయంగా ఎక్కువ క్రియాశీలంగా ఉండేది. నేనందులోనే ఉండేవాణ్ని.…

జాట్ ఉద్యమం: ది హిందు సంపాదకీయంపై విమర్శ

[ఈ టపాకు ముందరి ఆర్టికల్ లో ది హిందూ సంపాదకీయం అనువాదం ఇచ్చాను. సంపాదకీయం చేసిన విశ్లేషణపై విమర్శ కూడా ఇచ్చాను. విమర్శను పాఠకుల దృష్టికి తేవాలంటే ఆ భాగాన్ని ప్రత్యేకంగా ఇవ్వాలని భావిస్తూ మరో టపాగా పోస్ట్ చేస్తున్నాను. -విశేఖర్) ********* పటిదార్ లు, జాట్ ల నుండి రిజర్వేషన్ డిమాండ్లు తలెట్టడానికి పై సంపాదకీయం చూపిన కారణం నిజానికి ఇరుకైనది. ఇది పూర్తి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాతల నుండి తండ్రులకు, తండ్రుల…

వివేకరహిత (రిజర్వేషన్) డిమాండ్లు -ది హిందు ఎడిట్

(Unreasonable demands శీర్షికన ఈ రోజు ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.) ********* గత యేడు గుజరాత్ పటిదార్లు గానీ, ఈ యేడు హర్యానా జాట్ లు గానీ… సాపేక్షికంగా సంపన్న కులాల నేతృత్వంలో రిజర్వేషన్ కోసం హింసాత్మక నిరసనల ద్వారా పదే పదే పునరావృతం అవుతున్న డిమాండ్లు విభ్రాంతిని కలిగిస్తున్నాయి. హర్యానాలో జాట్లు సాపేక్షికంగా భూములు కలిగి ఉన్న సంపన్నులు. ఈ ప్రాంతంలో సామాజిక నిచ్చెనపైన అందరికంటే ఎత్తున ఉన్నవారిగా పరిగణించబడుతున్నారు. రాష్ట్రంలో…

ఉన్నత విద్యకు చేరుతున్న ఎస్.సిలు 10 శాతమే -ప్రభుత్వ సర్వే

షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజలనుండి యూనివర్సిటీ లాంటి ఉన్నత చదువుల వరకూ రాలేకపోతున్నారని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జరిపిన సర్వేలో తెలిసింది. ఇతర వెనుకబడిన కులాల విద్యార్ధులు వారి జనాభా దామాషాలోనే ఉన్నత స్ధాయి చదువుల వరకూ రాగలుగుతున్నారనీ, కానీ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన విద్యార్ధులలో చాలా తక్కువమంది మాత్రమే ఉన్నతస్ధాయి చదువులకు చేరగలుగుతున్నారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ విడుదల చేసిన సర్వే నివేదిక తెలిపింది.…

రిజర్వేషన్లు కాదు, వ్యవస్ధాగత అణచివేతే అసలు సమస్య

(ఈ ఆర్టికల్ నిజానికి ‘గౌతమ్ మేకా’ గారి వ్యాఖ్య. “66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే” అన్న టైటిల్ తో నేను రాసిన టపా కింద ఆయన రాసిన వ్యాఖ్య. విషయ ప్రాధాన్యత దృష్ట్యా, ఆంగ్లంలో రాసిన ఆయన వ్యాఖ్యను మరింతమంది పాఠకుల దృష్టికి తెచ్చే ఉద్దేశ్యంతో అనువదించి టపా గా మార్చుతున్నాను. ఇప్పటి వ్యవస్ధ పరిధిలోనే పరిష్కారం వెతికే ధోరణి ఉన్నప్పటికీ వ్యాఖ్యకు ఉన్న పరిమితి దృష్ట్యా, ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయంతో…

66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. బుధ, గురు వారాల్లో ఈ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలం అయింది. సమాజ్ వాదీ పార్టీ, శివసేన పార్టీలు బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయి. కోల్-గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపి ప్రమోషన్ రిజర్వేషన్ల బిల్లు కి బి.జె.పి మోకాలడ్డింది. “జూనియర్లు సీనియర్లవుతారు. ఇదేం జోకా? ప్రభుత్వ పాలనే జోకైపోయింది” అని బి.సి ల విముక్తి ప్రదాత అయిన…

ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ల బిల్లు: పార్టీల వికృత రూపాలు బట్టబయలు

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి గురువారం మరో ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ బుద్ధులు దేశ ప్రజల ముందు నగ్నంగా ప్రదర్శించబడ్డాయి. కోల్ గేట్ కుంభకోణం సృష్టించిన పార్లమెంటరీ సంక్షోభం నుండి బైట పడడానికి అధికార పార్టీ ‘ఎస్.సి, ఎస్.టి ప్రమోషన్ల రిజర్వేషన్’ బిల్లుని అడ్డు పెట్టుకుంటే, బి.సి ఓట్ల కోసం ఒక పార్టీ, హిందూ ఓట్ల కోసం మరొక పార్టీ ఈ…

రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నది బ్యూరోక్రట్లు, రాజకీయ నాయకులే -సుప్రీం కోర్టు

రిజర్వేషన్ కోటాల వలన సమకూరుతున్న ఫలితాలను ఆ వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారులు మాత్రమే లబ్ది పొందుతున్నారని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అవి ఎవరికైతే ఉద్దేశించబడ్డాయో వారికి అసలు రిజర్వేషన్ల సంగతే తెలియడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ కె.వి.రవీంద్రన్, జస్టిస్ ఎ.కె.పట్నాయక్ లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి ఈ వ్యాఖ్యానాలు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు), ఢిల్లీ యూనివర్సిటీలలో జరిగే అడ్మిషన్లలో ఒ.బి.సి రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం…