దళితుల అణచివేతక్కూడా దళితులే కారణమా?

[పూజ గారు రాసిన వ్యాఖ్యకు ఇది స్పందన. -విశేఖర్] పూజ గారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీ మనసులో మాట ధైర్యంగా చెప్పినందుకు మీకు అభినందనలు చెప్పి తీరాలి. ఈ స్పందన మీ వ్యాఖ్యపై కోపంతో రాయడం లేదని మీరు మొదట గుర్తించాలి. మీ వ్యాఖ్యకు నేను ఇస్తున్న గౌరవంగానే ఈ చర్చను చూడాలని నా విజ్ఞప్తి. మీరు వ్యక్తం చేసిన భావన ఇదే మొదటిసారి కాదు. ఈ మధ్య తరచుగా ఇలాంటి భావనలు, మాటలు వినిపిస్తున్నాయి.…

మోడి అవినీతి బైటపెడతా -రాహుల్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ తన వద్ద ఒక రహస్యం ఉన్నదని కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఆ రహస్యాన్ని చెప్పేస్తానేమో అన్న భయంతో తనను లోక్ సభలో అధికార పక్ష సభ్యులు మాట్లాడనివ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తన వద్ద ఉన్న రహస్యం “మోడి వ్యక్తిగతంగా పాల్పడిన అవినీతికి సంబంధించినది” అని ఆయన ఈ రోజు చెప్పారు. పార్లమెంటులో, ముఖ్యంగా లోక్ సభలో ఎవరు ఎవరిని మాట్లాడనివ్వడం లేదో అర్ధం కాకుండా…

రాహుల్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్

[ఏప్రిల్ 21 తేదీన ది హిందూలో ప్రచురించిన ‘Return of Rahul’ సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.] దాదాపు రెండు నెలల పాటు సెలవు రాహుల్ గాంధీ సెలవులో వెళ్లిపోవడం సరైన సమయంలో జరిగిన పరిణామమో ఏమో గానీ ఆదివారం నాడు ఢిల్లీలో భూ సేకరణ చట్టం (సవరణలు) కు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీ మాత్రం కాంగ్రెస్ పార్టీని మరింత చురుకైన ప్రతిపక్షంగా నిలబెట్టినట్లు కనిపిస్తోంది. నిరసనలకు ప్రారంభ ఊపు ఇచ్చింది రైతుల గ్రూపులు, పౌర…

సెలవులో రాహుల్ -ది హిందు ఎడిటోరియల్

[Rahul on Leave శీర్షికన నిన్న ది హిందులో ప్రచురితం అయిన ఎదిరోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్] రాహుల్ గాంధీ ఆత్మ శోధనకు ఎంచుకున్న ప్రస్తుత కాలం కంటే మించిన గడ్డు కాలం మరొకటి ఉండబోదు. పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలకు సరిగ్గా ముందు ఆయన ఆ పనికి పూనుకున్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎదుర్కొన్న అవమానకర ఓటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వం…

రాహుల్ సెలవు చీటీ -కార్టూన్

గత కొద్ది రోజులుగా పత్రికల్లో నానుతున్న వార్త ‘రాహుల్ ప్రకటించిన సెలవు (leave of absense).’ ఈ వార్త హెడ్ లైన్ మొదట చదివిన వారికి ఆయనిక శాశ్వతంగా రాజకీయాలకు సెలవు ప్రకటించారేమో అనిపించింది. వార్తలోకి వెళ్ళాక అదేమీ లేదని కొద్ది రోజుల పాటు ఆయన రాజకీయాల నుండి సెలవు పుచ్చుకుంటున్నారని అర్ధం అయింది. అంతలోనే ఆయన ప్రకటన హాస్యస్ఫోరకంగానూ తోచింది. ఎందుకంటే, ఓ పాత కధ ఉండేది. ఒక పంతులు గారు పడవలో నది దాటుతూ…

కాంగ్రెస్ తిరిగి ఎప్పటికీ లేచేను? -కార్టూన్

నాయకుడు: “లే, లే! మనం పోరాడాలి!” కురువృద్ధ పార్టీ: “నన్ను కూలదోసింది ఎవరూ!? (నువ్వు కాదూ?)” *** మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఓటమి సంపూర్ణం అయిందని రాజకీయ విశ్లేషకులు, పత్రికలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సమీప భవిష్యత్తులో ఆ పార్టీ కోలుకోవడం చాలా కష్టం అని తీర్మానిస్తున్నారు. కానీ పాజిటివ్ ఓటు కంటే నెగిటివ్ ఓటే ఎక్కువ ప్రభావం కలిగించే పరిస్ధితుల మధ్య ఆ పార్టీని కొట్టిపారేయడం తొందరపాటుతనమే కాగలదు. అయితే అందుకు ఒక…

కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభ పరిష్కర్త ఎవరు? -కార్టూన్

ఇంకెవరు, రాజవంశమే. దృతరాష్ట్రుడు గుడ్డివాడయినందుకు ఆయన్ని సింహాసనానికి దూరం చేశారా? పోనీ జనంలో ఇంకా ఎవరన్నా ఉద్దండుడు ఉన్నారా అని వెతికారా? లేదు కదా! ఆయన తమ్ముడు పాండు రాజుచేత బాధ్యతలు నిర్వర్తింపజేస్తూ ఆ గుడ్డాయన్నే కుర్చీలో కూర్చోబెట్టారు. సో కాల్డ్ ప్రజాస్వామ్యం లోనూ అదే తంతు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో రాజకీయ పార్టీలకు నాయకత్వం ఎక్కడి నుండి వస్తుంది? కార్యకర్తల నుండే రావాలి. కింది స్ధాయి నుండి సంస్ధాగత ఎన్నికలు జరిపించాలి. ఆ ఎన్నికల్లో నెగ్గిన వారిలోనుండి…

రాహుల్ అవినీతి వ్యతిరేక తమాషా -కార్టూన్

“తప్పు! పూర్తిగా తప్పు! మేము ఇదంతా చేయడానికి ఈ వ్యవస్ధ ఎలా అనుమతిస్తుందసలు?” ఎఎపి పుణ్యమాని రాజకీయ పార్టీలు అవినీతి వ్యతిరేక ఫోజు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అన్నా హజారే బృందం అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టిన దగ్గర్నుండే ఈ ఫోజులు మొదలయినప్పటికీ ఎఎపి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పరచడంతో ఈ ఫోజులు బాగా పెరిగాయి. ‘అవినీతి వ్యతిరేకత’కు ఓట్లు రాల్చే గుణం కూడా ఉందని తెలిసాక ఇక రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా?…

రాహుల్ సిద్ధం, షరతులు వర్తించును -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం తన పదవీకాలంలో మూడోసారి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తన అధికార దండాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తున్నట్లుగా పరోక్షంగా సూచించారు. ప్రధాన మంత్రి అభ్యర్ధిని తర్వాత ప్రకటిస్తాం అని చెబుతూనే కాంగ్రెస్ నాయకులలోకెల్లా రాహుల్ గాంధీకే ఆ పదవికి తగిన అర్హతలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తద్వారా తన వారసుడు రాహుల్ గాంధీయే అని ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ప్రధాన మంత్రి పత్రికలపై విమర్శలు కురిపించారు. పత్రికల…

ఆదర్శ స్కాం, రాహుల్ ఆదర్శం -కార్టూన్

ఢిల్లీలో ఎఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొదలు రాహుల్ గాంధీకి అవినీతి నిర్మూలనా జ్వరం పట్టుకుంది. అవినీతి నిర్మూలన తమ ఎజెండాలో కూడా ఉందని చెప్పుకోవడానికి ఆయన తెగ తంటాలు పడుతున్నారు. ఆదర్శ కుంభకోణం పైన మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు దరిమిలా తానూ అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి మరో అవకాశం కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల కోసం భారత ప్రభుత్వం ముంబైలో ఆదర్శ్ సొసైటీ పేరుతో స్ధల సేకరణ…

రాహుల్, మోడీ: పంచింగ్ బ్యాగ్స్ -కార్టూన్

ఎన్నికల ప్రచారం మామూలుగా ఎలా ఉండాలి? పోటీ చేసే అభ్యర్ధులు తమ తమ నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. నియోజక వర్గం సమస్యల పరిష్కారం దేశ భవిష్యత్తుతో ఎలా ముడి పడి ఉన్నాయో చెప్పగలగాలి. తమ తమ పార్టీల విధానాలను చెబుతూ అవి దేశాభివృద్ధికీ, నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికీ ఎలా దోహదపడతాయో చెప్పాలి. కానీ జరుగుతున్నది అందుకు పూర్తిగా విరుద్ధం. ప్రత్యర్ధి పార్టీల నాయకులపైన ఎంత గొప్పగా విమర్శలు చేస్తే అంత గొప్ప ప్రచారంగా పార్టీల…

లక్షల దళిత నాయకుల్ని సృష్టించే మంత్రదండం! -కార్టూన్

రాహుల్: ఒకరో ఇద్దరో కాదు, దళితుల కోసం లక్షల నాయకులు ఉద్భవించాలి… రాహుల్ నీడలోని కాంగ్రెస్ నేత: ఆ సూత్రం మనక్కూడా వర్తించడం ఎలాగో… – ఒకరూ, ఇద్దరూ కాదు; పదులూ, వందలూ కూడా కాదు; వేలు అసలే కాదు; ఏకంగా లక్షలాది దళిత నాయకుల్ని తయారు చేసే మంత్రదండం ఉన్న సంగతి ఎవరికైనా తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఆ మంత్రదండం మన యువ రాజా రాహుల్ గాంధీ వద్ద భద్రంగా ఉంది. ఆయన దాన్ని త్వరలో…

కొత్త బట్టలు కాదు, కొత్త రాజునే నేయగల నేర్పరులు! -కార్టూన్

కొత్త బట్టలా? కాదులే – ఇది మన కొత్త మహారాజు గారిని తయారు చేయడానికి… – మహారాజు గారి కొత్త బట్టల కధ అందరికీ తెలిసిందే. తమ పదవులకు, హోదాకు తగని వ్యక్తులకు తప్ప అందరికీ కనిపించే బట్టలు నేసి తెస్తామన్న నేతగాళ్ల చేతిలో రాజు, మంత్రి, వారి పరివారం అంతా ఫూల్స్ అయిన కధను కార్టూనిస్టు జ్ఞప్తికి తెస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు నేస్తున్నది యువరాజు వారి కొత్త బట్టలను కాదు. పాత మహారాజు…

మన్మోహన్: రాహుల్ గాంధీ బరువు తూచే యంత్రం?

అధికారం, హోదా అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయని/చేయలేని వ్యక్తిని ‘ఉత్సవ విగ్రహం’గా చెప్పుకోవడం పరిపాటి!అవడానికి ప్రధమ పౌరుడే అయినా ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలూ లేని, కేవలం కేంద్ర మాంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలపైన సంతకం మాత్రమే పెట్టగల రాష్ట్రపతిని ‘రబ్బర్ స్టాంప్’ గా సంభోధించడమూ తెలిసిందే. ప్రధాన మంత్రి పదవి వీటికి భిన్నం. అది భారత దేశంలో అత్యున్నత అధికారం కలిగిన పదవి. ఆ పదవిని అమెరికా కంపెనీలకు తప్ప భారత దేశ ప్రజలకు ఉపయోగించని మన్మోహన్…

ఆహా రాహుల్! ఏమి మీదు నాటకంబు?

“కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు” ఇది మన రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్య. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ధనిక రాజకీయవేత్తలకు వర్తించేది మాత్రమే’ అన్న నిర్వచనం ఏమన్నా ఉన్నట్లయితే ఆయన చెప్పిందాంట్లో సందేహం అనేదే లేదు. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వమే హడావుడిగా ఒక ఆర్డినెన్స్ తయారు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే, మరోపక్క ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే, తమ పార్టీలోని మరోనేత ఆ…