ఢిల్లీ ఆటో ఎక్స్ పో -కార్టూన్

ప్రస్తుతం జరుగుతున్న వివిధ అధికారిక, అనధికారిక కార్యక్రమాలను రాజకీయ పార్టీల కార్యకలాపాలతో, పార్టీల నాయకుల ధోరణులతోనూ, వారి ప్రకటనల తోనూ పోల్చి సున్నితమైన రాజకీయ వ్యంగ్యం పండించడం కార్టూనిస్టులకు ఇష్టమైన ప్రక్రియ.  ఈ ప్రక్రియ ద్వారా ఆయా నాయకుల, పార్టీల వ్యవహార శైలి గురించి తేలికగా అర్ధం చేసుకునే అవకాశం పాఠకులకు, లభిస్తుంది. ఒక్క చూపులో బోలెడు అర్ధాన్ని ఈ కార్టూన్ ల ద్వారా గ్రహించవచ్చు. ఢిల్లీలో నొయిడాలో ఆటో ఎక్స్ పో – 2016 ప్రదర్శన…

దళిత స్కాలర్ మరణం -ది హిందు

[Death of a Dalit scholar శీర్షికన జనవరి 19 తేదీన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] ********* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రీసర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న దళిత విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య, ప్రతిభా సంపన్నులతో నిండినవన్న భ్రాంతిని కలుగజేయడంలో పేరెన్నిక గన్న భారతీయ ఉన్నత విద్యా సంస్ధలు భూస్వామ్య దురహంకార గుణాల చేత వేధింపులకు గురవుతున్నాయనడానికి మరో విషాదకర సాక్షం.  (యూనివర్సిటీ) పాలకులు సస్పెండ్ చేసిన…

వాలుకి విరుద్ధంగా… -ది హిందు ఎడిట్..

[జూన్ 4 నాటి ది హిందు ఎడిటోరియల్ ‘Against the grain’ కు ఇది యధాతధ అనువాదం. ఈ శీర్షిక ఆంగ్లంలో ఒక సామెత. కట్టెను వాలుగా కొస్తే త్వరగా తెగుతుంది తప్ప అడ్డంగా కోస్తే అనుకున్న ఫలితం రాదని ఈ సామెత సూచిస్తుంది. ఈ సామెత ప్రస్తావించడంలోనే ది హిందు ఉద్దేశ్యం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కానీ ఎడిటోరియల్ లో గమనార్హమైన పరిశీలనలు ఉన్నాయి.] ***************** “న్యాయమైన నష్టపరిహారం పొందే హక్కు మరియు భూ సేకరణ, పునరావాసం,…

ఎవరు జీరో, ఎవరు హీరో! -కార్టూన్

నరేంద్ర మోడి ఏడాది పాలనకు రాహుల్ గాంధీ ఇచ్చిన మార్కులు పదికి సున్నా (జీరో). ఈ మేరకు రాహుల్ గాంధీ స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేశారు. కాంగ్రెస్ సభ్యులు ఆనందంగా బల్లలు చరిచారు. రాహుల్ గాంధీ లాంటి పిల్లగాడు తమ అధినేతను జీరోను చేస్తే బి.జె.పి నేతలు ఊరుకుంటారా? చస్తే ఊరుకోరు. వెంకయ్య నాయుడు గారి లాంటి ప్రాసల పండితులైతే అసలే ఊరుకోరు. “జీరోలకు జీరోలే కనిపిస్తారు. హీరోలు కనిపించరు” అని రాహుల్ విమర్శను ఆయన తిప్పి…

రాహుల్ యుద్ధం: ఉత్త కుమారుడేనా? -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ కనీసం ఉత్తర కుమారుడు కూడా కాదనీ, ఆయన సోనియా గాంధీకి ‘ఉత్త కుమారుడే’ అనీ ఆయనగారి ధోరణి చెబుతోందని కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి తామిద్దరమే బాధ్యులమని తల్లిగారితో పాటు గంభీరంగా ప్రకటించిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో ప్రజల కోసం ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తీరా పార్లమెంటరీ సమావేశాలు మొదలయ్యాక ఆయన పత్తా లేకుండా పోయారు. ఎక్కడో చివరి వరుసలో కూర్చుని…

ఇంతకీ గెలిచిందెవరు? -కార్టూన్

2014 సాధారణ ఎన్నికల్లో గెలిచింది ఎవరు? పార్లమెంటు సెంట్రల్ హాలులో భావోద్వేగ పూరిత ప్రసంగం ఇచ్చిన నరేంద్ర మోడి కన్నీరు పెట్టుకోగా, ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేస్తామని చెప్పిన రాహుల్ మాత్రం యధావిధిగా కాంగ్రెస్ యువరాజుగా కొనసాగుతున్నారు. దానితో ఎన్నికల్లో గెలిచిందేవరన్న అనుమానం వస్తోందని ఈ కార్టూన్ సూచిస్తోంది.  పార్లమెంటు సెంట్రల్ హాల్ లో బి.జె.పి పార్లమెంటరీ నేతగా ఎన్నికయిన అనంతరం 30 నిమిషాలు ప్రసంగించిన మోడి ఆ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నారని పత్రికలు నివేదించాయి.…

గాంధీల ఆత్మను మోసి అలసిన మన్మోహన్ దేహం -కార్టూన్

కార్టూనిస్టులు ఎంత సున్నితంగా -కానీ శక్తివంతంగా- ఆలోచించగలరో ఈ కేశవ్ సురేంద్ర కార్టూన్ మరొక ఉదాహరణ. “రాహుల్ గాంధీ నా చెప్పుల్లో తన కాళ్ళు దూర్చవచ్చు” (Rahul Gandhi can step into my shoes) అని మన్మోహన్ గాంధీ, క్షమించాలి, మన్మోహన్ సింగ్ నిన్న (మంగళవారం) చేసిన ప్రకటనను వాస్తవాలకు అన్వయించిన విధానం అద్వితీయం! రాహుల్ గాంధీని మన్మోహన్ ఆహ్వానించడం ఇదే మొదటిసారి కాదు. బహుశా చివరిసారీ కాదేమో. ఈయన ఆహ్వానం పలకడం ఆయన సున్నితంగా…

అసలు మైకు పట్టనేల, పట్టితిపో…… -కార్టూన్

అంత భారీ భావాలు వ్యక్తపరచనేల, ఇంత భారం మోయనేల? – రాహుల్ ఇప్పుడు మైకు భారాన్ని మోస్తున్నాడు. మొదటిసారి ‘కాన్ఫేడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్’ (సి.ఐ.ఐ) గురువారం జరిపిన సమావేశంలో మైకు పట్టిన రాహుల్ గాంధీ పేదలను, ముస్లింలను, దళితులను  పరాయీకరిస్తే ఆర్ధిక వృద్ధి తీవ్రంగా దెబ్బ తింటుందని బోధించాడు. సామాన్య మానవుడికి సాధికారత అప్పగించే విధంగా వ్యవస్ధాగత మార్పులు తేవలసి ఉందని, అందుకోసం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చాడు. “వివిధ తరగతులను పరాయీకరించే రాజకీయాలతో ఆడుకుంటే…

కై పొ చె! కాంగ్రెస్, బి.జె.పి ల గాలిపటాలాట -కార్టూన్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నాయకులతో పాటు పత్రికల కేంద్రీకరణ అటు మళ్లడం సహజమే. రాజకీయ నాయకులే తమ ఏర్పాట్లతో పత్రికలను ఆకర్షిస్తారా లేక పత్రికలే రాజకీయ నాయకులను రెచ్చగొట్టి వార్తలు సృష్టిస్తాయా అన్నది చెప్పడం ఒకింత కష్టమే అయినా, ఒకరికొకరు సహకరించుకోవడం మాత్రం ఒక వాస్తవం. ప్రధాన మంత్రి పదవికి పోటీదారుగా ఎవరిని ప్రకటించాలి అన్న విషయమై బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలలో సాగుతున్న అంతర్గత మరియు బహిరంగ ఉత్సుకత లేదా ఉద్రిక్తతల వ్యక్తీకరణలు వివిధ రూపాల్లో…