ఉత్తరఖండ్ నుండి పాఠాలు -ది హిందు ఎడ్..

[Lessons from Uttarakhand శీర్షికన ఈ రోజు ప్రచురితం అయిన ది హిందు ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం] ******** తొమ్మిది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా సుప్రీం కోర్టు నిషేధం విధించిన దరిమిలా ఉత్తర ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, అసెంబ్లీ పరీక్షలో నెగ్గడం ముందుగానే ఖాయం అయింది. మిగిలిన 27 మంది అనుయాయులు, ఆరుగురు సభ్యుల కూటమిల ఓట్లు ఆయన పరీక్షలో గెలిపించాయి. సుప్రీం కోర్టు ధృవీకరించిన ఈ…

ఉత్తరఖండ్: మొట్టికాయలతో.., రాష్ట్రపతి పాలన రద్దు!

నైనిటాల్ హై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టింది. బహుశా అరాయించుకోలేనంత గడ్డి! అరగకపోయినా విసర్జించ వీలు కాని గడ్డి! ఒక్క రోజు కాదు, గత రెండు మూడు రోజులుగా గడ్డి పెడుతూనే ఉంది. హఠం వేసినట్లు కేంద్ర ప్రభుత్వ లాయర్లు వెర్రిమొర్రి వాదనలు చేసే కొద్దీ గడ్డి పరిమాణం పెరుగుతూ వచ్చింది. హై కోర్టు నిజానికి తన తుది తీర్పును రిజర్వ్ లో పెట్టుకుని తర్వాత ప్రకటిద్దాం అనుకుంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో చేసినట్లుగానే…

రాష్ట్రపతి పాలన ఎత్తుగడ? -కత్తిరింపు

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సీమాంధ్ర ఉద్యమం, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక అయోమయ సృష్టి ఇత్యాది అంశాలపై కాస్త వాస్తవానికి దగ్గరగా విశ్లేషణలు, విమర్శలు, సూచనలు ప్రచురిస్తున్నది ఆంధ్ర జ్యోతి దిన పత్రికే అనుకుంటాను. సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఇతర పత్రికలు, ఛానెళ్ల కంటే ఒక అడుగు ముందే ఉన్నది ఆ పత్రిక. ‘రాష్ట్రపతి పాలన ఎత్తుగడ?’ శీర్షికతో వచ్చిన ఈ విశ్లేషణ ఈ రోజు (అక్టోబర్ 11, 2013) జ్యోతిలో…

తెలంగాణ అంశాన్ని కేంద్ర త్వరలోనే తేల్చేస్తుంది -సి.ఎం కిరణ్ కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీలో విలేఖరులకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్ర తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వచ్చిన సి.ఎం కిరణ కుమార్ రెడ్డి, డెప్యుటి సి.ఎం దామాదర రాజ నరసింహరాజు లు సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్ లతో…