అమెరికా: అసలే కరువు, ఆపై రారాజు దావానలం -ఫోటోలు

సగానికి పైగా అమెరికా రాష్ట్రాల్లో ఇప్పుడు దుర్భిక్షం తాండవిస్తోంది. సంవత్సరాల తరబడి కొనసాగుతోన్న వర్షపాత రాహిత్యం వల్ల పంటలు పండక కరువు, దరిద్రం సమస్యలు అమెరికన్లను పీడిస్తున్నాయి. దానితో పాటు వేడి వాతావరణం వ్యాపించడంతో పశ్చిమ, మధ్య పశ్చిమ రాష్ట్రాలు పొడిబారాయి. దరిమిలా కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాలు సున్నితంగా మారి ఏ మాత్రం చిన్న పొరబాటు జరిగినా భారీ దావానలాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం కాలిఫోర్నియా  నిండా దావాలనాలు వ్యాపించాయి. పొడి వాతావరణం దావానలం వ్యాపించడానికి అనువుగా…