భారత రాయబారి కూతురికి అమెరికా స్కూల్‌లో ఘోర పరాభవం, పరువు నష్టం కేసు దాఖలు

అమెరికా ప్రభుత్వాధికారులు, పోలీసులు, ఇతర తెల్ల మేధావులు భారత అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి భారత మహిళా రాయబారి నుండి బాలివుడ్ హీరో షారుఖ్ ఖాన్ వరకు విమానాశ్రయాలలో తనిఖీలు ఎదుర్కొన్న ఘటనలు మనకు తెలుసు. సిక్కు మతస్ధుడైన భారత రాయబారిని అతని మత సాంప్రదాయన్ని అవమాన పరుస్తూ, పేలుడు పదార్ధాలు ఉన్నాయేమోనని అనుమానిస్తూ తలపాగా విప్పించిన ఘటనలు పత్రికల్లో చదివాం. అమెరికా సెక్రటరీ ఆఫ్…