ప్రభుత్వాలు కూడా ఖాఫ్ పంచాయితీలేనా? -కార్టూన్

“నిన్ను ఇప్పటికిప్పుడే బదిలీ చేసేశాం. ‘అవినీతి’ కులాన్ని నువ్వు గాయపరిచావు” వాద్రా భూ కుంభకోణంపై విచారణకు ఆదేశించినందుకు హర్యానా లాండ్ రిజిష్ట్రేషన్ ఉన్నతాధికారి ‘అశోక్ ఖేమ్కా’ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దానికి హర్యానా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలే కారణమని ప్రభుత్వం ఇప్పుడు బొంకుతోంది. నాలుగు రోజుల క్రితం అధికారుల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ ‘విచక్షణాధికార హక్కు’ అని చెప్పి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అశోక్ బదిలీని సమర్ధించుకున్నాడు. బదిలీ పై విమర్శలు…

సోనియా అల్లుడి కేసులో ‘విచ్ హంట్’ మొదలు

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులో విచ్ హంట్ మొదలయింది. వాద్రా, డి.ఎల్.ఎఫ్ ల అక్రమ భూ దందా పై విచారణకు ఆదేశించిన సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిని హర్యానా ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసింది. ఈ బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన కారణం ఏమీ ఇవ్వడం లేదు. 21 సంవత్సరాల సర్వీసులో 43 బదిలీలు ఎదుర్కోవడం అధికారి నిజాయితీకి తార్కాణం గా నిలుస్తుండగా, వాద్రా అక్రమ ఆస్తులపై విచారణకు ఆదేశించిన సదరు అధికారిని ఉన్నపళంగా బదిలీ…

కమలమే హస్తమా? -కార్టూన్

‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ (ఐ.ఎ.సి) నేత అరవింద్ కేజ్రీవాల్, రాబర్ట్ వాద్రా అక్రమాస్తులపై ఆరోపణలు సంధించాక కాంగ్రెస్, బి.జె.పి ప్రతినిధుల మాటల్లో తేడా మసకబారింది. డి.ఎల్.ఎఫ్, వాద్రా కంపెనీల లావాదేవీల్లో తప్పేమీ లేదని కాంగ్రెస్ నాయకులు, మంత్రులు వెనకేసుకొస్తుంటే, వాద్రాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు సాక్షాలు లేవని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ వారికి వంతపాడాడు. లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు వాద్రా అవినీతిపై అసలు గొంతే ఎత్తలేదు. బి.జె.పి అధికార ప్రతినిధులు విలేఖరుల సమావేశాల్లో…

డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా ప్రభుత్వం ఏజెంటు -కేజ్రీవాల్

సోనియా గాంధీ అల్లుడి గిల్లుడి పై దృష్టి పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన స్వరాన్ని మరింత పెంచాడు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించకుండా స్ధిరాస్తి కంపెనీ ‘ఢిల్లీ లాండ్ అండ్ ఫైనాన్స్’ (డి.ఎల్.ఎఫ్) కి దళారీగా వ్యవహరిస్తున్నదని తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. భారత దేశానికి అనధికారిక ప్రధమ కుటుంబంగా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు అభివర్ణించే సోనియా కుటుంబ అల్లుడు రాబర్ట్ వాద్రా కు అయాచిత లబ్ది చేకూర్చిన డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా రాష్ట్ర…