రాఫేల్: బి‌జే‌పి నేతలారా, అధికారం మీదేగా విచారణ చెయ్యరేం?

భారతీయ జనతా పార్టీ (బి‌జే‌పి) నేతల ధోరణి మరీ విడ్డూరంగా కనిపిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వాధికారం ఉన్నది బి‌జే‌పి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోని అత్యంత శక్తివంతమైన విచారణ సంస్ధలన్నీ బి‌జే‌పి ప్రభుత్వం నియంత్రణలో ఉన్నాయి. కాబట్టి రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కమీషన్ చేతులు మారినట్లు వచ్చినట్లు ఆరోపణలపై విచారణ చేయవలసిన బాధ్యత బి‌జే‌పి పైనే ఉన్నది, అధికారం కూడా వారి చేతుల్లోనే ఉన్నది. అలాంటిది ఫ్రెంచి పరిశోధనా వార్తల పోర్టల్ మీడియా పార్ట్ తాజాగా…

రాఫెల్ డీల్: లంచం సాక్ష్యాలున్నా సి‌బి‌ఐ దర్యాప్తు చేయలేదు!

ఫ్రాన్స్ యుద్ధ విమానాల కంపెనీ దాసో ఏవియేషన్ (Dassault Aviation), భారత దేశానికి రాఫేల్ యుద్ధ విమానాలు సరఫరా చేసిన సంగతి తెలిసిందే. యూ‌పి‌ఏ హయాంలోనే 125 విమానాల సరఫరాకు ఒప్పందం కుదిరినా అంతిమ ఒప్పందం సాగుతూ పోయింది. నరేంద్ర మోడి అధికారం చేపట్టిన వెంటనే ఈ ఒప్పందాన్ని పరుగులు పెట్టించాడు. ఒప్పందాన్ని ప్రభుత్వం-ప్రభుత్వం ఒప్పందంగా మార్చి 36 రాఫేల్ జెట్ విమానాలు సరఫరాకు ఒప్పందం పూర్తి చేశాడు. ఈ ఒప్పందంలో లంచం చేతులు మారాయని ఫ్రెంచి…