అసాంజే: బ్రిటన్ అప్పీలు తిరస్కరణ

వికీ లీక్స్ చీఫ్ ఎడిటర్ జులియన్ అసాంజే విడుదలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. అసాంజేను వెంటనే విడుదల చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరిన ఐరాస తీర్పుకు వ్యతిరేకంగా బ్రిటన్ చేసిన అప్పీలును ఐరాస రెండోసారి కూడా తిరస్కరించడంతో అయన విడుదల దాదాపు అనివార్యం అయింది. అయితే అసాంజేను విడుదల చేస్తారా లేదా మరో సాకు వెతికి పట్టుకుని నిర్బంధం కొనసాగిస్తారా అన్నది తెలియరాలేదు.  నాలుగు సంవత్సరాలుగా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో అసాంజే బందీగా ఉన్న…

స్నోడెన్ భయం: బొలీవియా అధ్యక్షుడి విమానాన్ని దింపిన ఆస్ట్రియా

అమెరికా, ఐరోపా రాజ్యాలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయన రష్యా విమానాశ్రయంలో కూర్చుని ఏ దేశం తనకు ఆశ్రయం ఇస్తుందా అని ఎదురు చూస్తుండగా ఆయన తమకు తెలియకుండా ఎక్కడ తప్పించుకుని పోతాడా అని అమెరికా కుక్క కాపలా కాస్తోంది. స్నోడెన్ కోసం అమెరికా ఎంతకు తెగించిందంటే బొలీవియా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానానికి తమ గగనతలంపై ప్రయాణించకుండా ఐరోపా దేశాలపై ఒత్తిడి తెచ్చేటంతగా. ఫ్రాన్సు, పోర్చుగల్, స్పెయిన్ దేశాలు బొలీవియా అధ్యక్షుడు…

స్నోడెన్: ఈక్వడార్ కు అమెరికా బెదిరింపులు

ఇంటర్నెట్ కంపెనీల ద్వారా ప్రపంచ ప్రజలపై అమెరికా సాగిస్తున్న గూఢచర్యాన్ని, ఏకాంత హక్కుల ఉల్లంఘనను వెల్లడి చేసిన మాజీ సి.ఐ.ఏ టెక్నీషియన్ ఎడ్వర్డ్ స్నోడెన్ కేంద్రంగా అమెరికా బెదిరింపులు కొనసాగుతున్నాయి. మాస్కో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ ను వెంటనే తమకు అప్పగించాలనీ, లేకపోతే రష్యా-అమెరికా సంబంధాలు దెబ్బ తింటాయని హెచ్చరించిన అమెరికా, స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వజూపుతున్న ఈక్వడార్ ను తీవ్రంగా బెదిరిస్తోంది. అమెరికా ప్రభుత్వం లోని వివిధ నాయకులు, అధికారులు ఈక్వడార్ పై వాణిజ్య…