ఇంటర్నెట్ లో దళితులపై కువ్యాఖ్యలు నేరం -ఢిల్లీ కోర్టు
ఢిల్లీ కోర్టు ఒక సంచలన తీర్పు ప్రకటించింది. సోషల్ మీడియాలో దళితులపై పెచ్చు మీరుతున్న వివక్షాపూరిత వ్యాఖ్యలు, దూషణలకు చెక్ పెడుతూ ప్రగతిశీల తీర్పు ప్రకటించింది. తీర్పు ప్రకారం ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం పరిధిలోకి సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు కూడా వస్తాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ మొదలైన సోషల్ నెట్వర్క్ వెబ్ సైట్ లలో ఎస్‌సి, ఎస్‌టి కులాలపై వివక్షాపూరిత వ్యాఖలు చేసినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినా…