రక్షణ మంత్రి గారూ మీరు చెప్పింది నిజం కాదు. ఇదిగో సాక్ష్యం!
భారత రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆర్ఎస్ఎస్-బిజేపి సంస్ధల తరపున, జరిగిన చరిత్రను తిరగ రాసే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడి మంత్రివర్గంలో కాస్తంత మౌనంగా, ఆర్ఎస్ఎస్ భావజాల ప్రచారాలకు, అబద్ధపు ఉల్లేఖనలకు దూరంగా ఉన్నట్లు కనిపించే ఆయన తాను సెపరేట్ కాదనీ, ఆ తానులో ముక్కనేనని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ పితామహుల్లో ఒకరైన వీర సావర్కార్ భారత దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడానికి కృషి చేసిన తొలి తరం యువకుల్లో ఒకరు.…