Mr మోడీ, 2014 ఎన్నికల లెక్కలు ఎందుకు చూపరు? -ధాకరే
నరేంద్ర మోడిని పొగడ్తలతో ముంచెత్తే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధిపతి రాజ్ ధాకరే ఈ రోజు తీవ్ర విమర్శలతో ఆయనపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల లెక్కలు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ కు సమర్పించలేని సంగతిని గుర్తు చేశాడు. బ్లాక్ మనీ లేకుండానే మీరు 2014 ఎన్నికల్లో గెలిచారా అని ప్రశ్నించారు. పాత నోట్ల రద్దు చర్య, చెప్పిన ఫలితాన్ని ఇవ్వకపోతే దేశం అరాచకం లోకి జారిపోతుందని అందుకు నరేంద్ర మోడియే బాధ్యత…