ఉత్తరాఖండ్: ఫ్లోర్ లేని చోట ఫ్లోర్ టెస్ట్! -కార్టూన్

“ఏ ఫ్లోర్ టెస్టూ?! వాళ్ళు అసలు ఫ్లోరే లేకుండా చేస్తిరాయే…!” ********* కాంగ్రెస్ ధరించిన అప్రజాస్వామిక కీర్తి కిరీటంలోని కలికితురాళ్లను బి‌జే‌పి ఒక్కొటొక్కటిగా దొంగిలిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే ప్రారంభమై ఇందిరా గాంధీ హయాంలో ఊపందుకున్న విచక్షణారహిత ‘ఆర్టికల్ 356 ప్రయోగం’ ప్రస్తుతం ప్రధాని మోడి నేతృత్వం లోని బి‌జే‌పి ప్రభుత్వం ప్రతిపక్షాలపై ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించిన బి‌జే‌పి (కేంద్ర) ప్రభుత్వం పరిస్ధితులు…

ఎగరలేని మోడి విమానం -కార్టూన్

ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి పార్లమెంటు విమానం. ఈ విమానానికి ఒక రెక్క లోక్ సభ అయితే మరొక రెక్క రాజ్య సభ. ఇరు సభల్లో కూర్చొని ఉన్న సభ్యుల సంఖ్య ఆ రెక్కల కింద ఉండే ఇంజన్లు. మోడి/బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వానికి లోక్ సభలో నిఖార్సయిన మెజారిటీయే ఉంది. కానీ రాజ్య సభలో ఆ పార్టీకి మెజారిటీ లేదు. అనగా మోడి విమానానికి ఒక రెక్కకు ఒకటే ఇంజన్ ఉంటే మరో రెక్కకు ఏకంగా…