ఢిల్లీ కోర్టులో సుప్రీం కోర్టు ఆదేశాలకు దిక్కు లేదు!

నిన్నటి సుప్రీం కోర్టు గాండ్రింపులు పిల్లి కూతల కంటే అధ్వాన్నంగా మారిపోయాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. హిందూత్వ లాయర్ల వీరంగం ముందు భారత పార్లమెంటు, భారత న్యాయ చట్టాలు, పోలీసు వ్యవస్ధ… చేష్టలుడిగి నిలబడిపోయాయి. కన్హైయా కుమార్ ను హాజరుపరచవలసిన పాటియాలా కోర్టు ఆవరణలోకి చొచ్చుకు వచ్చిన హిందూత్వ గూండాలు -వారిలో కొందరు లాయర్లూ ఉండవచ్చు- జే‌ఎన్‌యూ విద్యార్ధులు, ప్రొఫెసర్లు, విలేఖరుల మీద మంగళవారం దాడి…

లైసె ఫెయిర్, నూతన ఆర్ధిక విధానాలు, ఆర్ధిక సంక్షోభం -వివరణ

(ఈ పోస్టుతో కొత్త వర్గం -కేటగిరీ- ‘ప్రశ్న-జవాబు’ ప్రారంభిస్తున్నాను. కొన్ని వారాల క్రితం చందుతులసి గారు ఇచ్చిన సలహాను ఈ విధంగా అమలు చేస్తున్నాను. మొట్టమొదటి ప్రశ్న మాత్రం తిరుపాలు గారిది. ఒక టపా కింద వ్యాఖ్యగా ఆయన అడిగిన ప్రశ్న ఇది. నేనిచ్చిన సమాధానాన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసి ప్రచురిస్తున్నాను. ఈ కేటగిరీ కింద సమాధానం నేనే ఇవ్వాలన్న రూలు లేదు. సమాధానం తెలిసిన సందర్శకులు ఎవరైనా ఇవ్వవచ్చు. కానీ ప్రశ్న ఎక్కడ వేయాలి…