లైసె ఫెయిర్, నూతన ఆర్ధిక విధానాలు, ఆర్ధిక సంక్షోభం -వివరణ

(ఈ పోస్టుతో కొత్త వర్గం -కేటగిరీ- ‘ప్రశ్న-జవాబు’ ప్రారంభిస్తున్నాను. కొన్ని వారాల క్రితం చందుతులసి గారు ఇచ్చిన సలహాను ఈ విధంగా అమలు చేస్తున్నాను. మొట్టమొదటి ప్రశ్న మాత్రం తిరుపాలు గారిది. ఒక టపా కింద వ్యాఖ్యగా ఆయన అడిగిన ప్రశ్న ఇది. నేనిచ్చిన సమాధానాన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసి ప్రచురిస్తున్నాను. ఈ కేటగిరీ కింద సమాధానం నేనే ఇవ్వాలన్న రూలు లేదు. సమాధానం తెలిసిన సందర్శకులు ఎవరైనా ఇవ్వవచ్చు. కానీ ప్రశ్న ఎక్కడ వేయాలి…

స్టేట్ మెంట్ పేరుతో ఆలస్యం, రక్తం ఓడుతూ పోలీసుల ముందే దుర్మరణం

తమతో బస్టాండ్ లో నిలబడి ఉన్న స్నేహితురాలిని కళ్ళముందే అసభ్యంగా వేధిస్తున్నారు. భరించలేని యువకులిద్దరూ గ్యాంగ్ అసభ్య చేష్టలకి అడ్డు చెప్పారు. అడ్డుకున్నందుకు ఇద్దరి యువకులని తీవ్రంగా కొట్టడమే కాకుండా కత్తితో రవిని కడుపులో పొడిచి పారిపోయారు. ‘ది హిందూ’ ప్రకారం యువకులిద్దరూ పోలీసులకి ఫోన్ చేయడంతో సమయానికి అక్కడికి వచ్చిన పోలీసులు బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్ళడం మాని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు. స్టేట్ మెంట్ తీసుకుంటూ రక్తం కారుతున్న రవిని 40 నిమిషాలు పోలీస్…