ప్రధాని అయ్యాక ‘రాజధర్మం’ గుర్తుకొచ్చింది! -కార్టూన్

“ఏ సాకుతో అయినా సరే, ఏ మతానికైనా వ్యతిరేకంగా హింస జరగడం మనం ఆమోదించరాదు. అలాంటి హింసను నేను గట్టిగా ఖండిస్తాను. ఈ విషయంలో నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.” “(మతపరమైన) విశ్వాసం కలిగి ఉండడంలో పూర్తి స్ధాయి స్వేచ్ఛ ఉండేలా నా ప్రభుత్వం చూస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా, అవాంఛనీయ ప్రభావం లేకుండా అతడు/ఆమె తనకు ఇష్టమైన మతంలో కొనసాగేందుకు లేదా అనుసరించేందుకు, ఎవరూ నిరాకరించలేని హక్కు ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారని గుర్తిస్తుంది. బహిరంగంగా…