రాజ్యసభ ఎన్నికలు: మండుతున్న ధరలు -కార్టూన్

గృహస్ధుడు & నాయకుడు: “అబ్బబ్బ! ధరలు మరీ అందుబాటులో లేకుండా పోయాయి!” ********* ప్రజల మేలు ఏనాడూ కోరని పార్టీలు, వాటి నాయకులు ఆ సంగతి మరిపించటానికి అలవి గాని వాగ్దానాలు చేయడం, అవి తీర్చలేక (ఆఫ్ కోర్స్! తీర్చే ఉద్దేశం లేక) ఎన్నికలలో అక్రమాలకు పాల్పడటం పరిపాటి. ఎన్నికల అక్రమాలలో పేరెన్నిక గన్నవి డబ్బు పంపిణీ, మద్యం తాగబోయించటం అని అందరికీ తెలిసిన సంగతే! కూలీనాలితో పొట్ట పోసుకునే శ్రామికులకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియదు.…

జయలలిత: అల్లంత శిఖరాన… దభేల్! -కార్టూన్

జయలలిత కెరీర్ ఇక ముగిసినట్లేనా? ముగిసినట్లే అని ఆమె వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికీ శోక హృదయులై ఉన్నా, మించిపోయింది ఏమీ లేదన్న ధైర్యంతో ఉన్నారు. చో రామస్వామి లాంటి తమిళ రాజకీయ విశ్లేషకులు ఆమెకు ఇంకా అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. జయలలిత తన కెరీర్ లో పీక్ దశలో ఉండగా కోర్టు తీర్పు ఆమెకు ఆశనిపాతం అయిందని ది హిందూ లాంటి పత్రికలు సైతం విశ్లేషించాయి. పీక్ దశ అంటే…

న్యాయానికి సుదూర రహదారి -ది హిందు ఎడిట్

(అక్రమ ఆస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారిస్తూ కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది 4 సం.ల కారాగార శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. సహ నిందితులకు 4 సం.ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఫలితంగా అవినీతి కేసులో శిక్ష పడిన మొదటి ఉన్నత స్ధాయి నేతగా జయలలిత చరిత్ర పుటలకు ఎక్కారు. అవినీతి కేసుల్లో నేతలు తప్పించుకుపోకుండా ఇటీవల చేసిన చట్టం ఫలితంగా ఎం.ఎల్.ఏ పదవి, తద్వారా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన…

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇలా వస్తాయా? -కార్టూన్

“అది కేవలం ముందు జాగ్రత్త కోసమే, వారి ఎన్నికల ఖర్చు పైన ఆర్.టి.ఐ దస్త్రం పడేస్తామని వారికి తెలుసు!” సమాచార హక్కు చట్టం పోయి పోయి రాజకీయ పార్టీల మెడకు చుట్టుకుంటోంది. ఏ పార్టీలయితే ప్రజలకు ప్రభుత్వం నుండి సమాచారం పొందే హక్కు ఉన్నదని సభలపై బల్లలు గుద్ది మరీ వాదించాయో, ఆ పార్టీలే ఇప్పుడు ఆ చట్టం తమకు వర్తించదని వాదిస్తున్నాయి. ప్రభుత్వాల ఆధారిటీని ఒక ప్రత్యేక (unique) పద్ధతిలో పార్టీలు తమ గుప్పెట్లో పెట్టుకుంటాయని,…

ఆడలేక ‘మద్దెల ఓడు’ అంటున్న సోనియా

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి సరైన అభ్యర్ధులను నిలబెట్టక పోవడమే కారణమని సోనియా గాంధీ చెపుతోంది. ఓటమి వల్ల యు.పి.ఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని విశ్వాసం వ్యక్తం చేసింది. యు.పి ఎన్నికల్లో పార్టీ బలహీనం కావడం వల్లే ఓట్లు పడలేదని తేల్చేసింది. ‘అధిక ధరలు’ పార్టీ అభ్యర్ధుల ఎన్నికల అవకాశాలను దెబ్బ తీసి ఉండవచ్చని కూడా ఆమె అంగీకరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయవలసి ఉందని…