రష్యా విమానం కూల్చివేత అమెరికా పనే -రష్యా

రష్యాకు చెందిన ‘సుఖోయ్ సూపర్ జెట్ 100’ విమానం మే నెల మొదటి వారంలో ఇండోనేషియా కొండల్లో కూలి పోవడం వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా మిలట్రీ గూఢచారి సంస్ధ జి.ఆర్.యు ఆరోపించిందని ప్రెస్ టి.వి తెలిపింది. విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్నవారంతా అక్కడే చనిపోయారు. విమానానికి గ్రౌండ్ సిబ్బందికి ఉన్న సంబంధాన్ని అమెరికా గూఢచర్య సంస్ధలు తెంపేయడంతో విమానం ప్రమాదానికి గురయ్యిందని రష్యా తెలిపింది. “ఒక ఎయిర్ క్రాఫ్ట్ కీ గ్రౌండ్ సిబ్బందికీ మధ్య జరిగే…