అంతుబట్టని పుతిన్ వ్యూహం!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగినట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా సైన్యం సాగిస్తున్న దాడి చూస్తుంటే పుతిన్ మాదక ద్రవ్యాలు సేవించిన స్థితిలో నిర్ణయాలు తీసుకుంటున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా పుతిన్, అమెరికా ఏకపక్ష నాటో విస్తరణ పట్ల పాటిస్తూ వచ్చిన సంయమనం, సిరియా, లిబియాల విషయంలో అనుసరించిన సాపేక్షిక హేతుబద్ధత, రష్యా ఆర్ధిక-రాజకీయ వ్యవస్థ నిర్మాణంలో చూపించిన దార్శనికత, తూర్పు…