ఇండియాయే అందరికీ నేర్పింది -రష్యా టుడేలో ఓ వ్యాఖ్య

రష్యా టుడే పత్రిక ఈ రోజు (జూన్ 11, 2014) ఒక వార్త ప్రచురించింది. దాని ప్రకారం భూమి, చంద్రుల వయస్సు గతంలో ఊహించినదాని కంటే 6 కోట్ల సంవత్సరాలు ఎక్కువని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్య కుటుంబం ఏర్పడిన 10 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి, చంద్రుడు గ్రహాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో సేకరించిన Xenon ఐసోటోప్ లను పరిశోధించాక ఇది తప్పనీ సూర్య కుటుంబం ఏర్పడిన 4 కోట్ల సంవత్సరాలకే…

బోస్టన్ బాంబు పేలుళ్లు -ఫోటోలు

అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయి. సెకన్ల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో ముగ్గురు చనిపోగా 130 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. 40 కి.మీ బోస్టన్ మారధాన్ పరుగు పందెం చివరి అంచెలో ఈ పేలుడు సంభవించింది. ప్రేక్షకులు నిలుచున్న చోట పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం ఏరియల్ వ్యూ నుండి తీసిన వీడియోను కింద చూడవచ్చు.   ఈ కింది ఫోటోలను ఆర్.టి (రష్యా…

ఇప్పుడు అమెరికాకి నెం.1 టార్గెట్, వెనిజులా -హాలీవుడ్ దర్శకుడు

అమెరికా ప్రభుత్వానికి, అమెరికా మీడియాకి ఇపుడు వెనిజులా నెంబర్ 1 టార్గెట్ అని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలివర్ స్టోన్ వ్యాఖ్యానించాడు. 2009లో హ్యూగో ఛావెజ్ పై ‘సౌత్ ఆఫ్ ద బోర్డర్’ అనే డాక్యుమెంటరి నిర్మించి ఛావెజ్ గురించిన వాస్తవాలను/అవాస్తవాలను అమెరికా ప్రజలకు తెలియజేసేందుకు ఆలివర్ స్టోన్  ప్రయత్నం చేశాడు. తన సినిమా ప్రత్యేక స్క్రీనింగ్ సందర్భంగా చనిపోయిన ఛావెజ్ పశ్చిమ వార్తా పత్రికలు, ప్రభుత్వాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని దుయ్యబట్టాడు. వెనిజులా ప్రజలు అత్యధిక మెజారిటీతో…

కోలేటరల్ మర్డర్: ఓ అమెరికా సైనికుడి పశ్చాత్తాపం

2010 ఏప్రిల్ 5 తేదీన ‘కోలేటరల్ మర్డర్’ శీర్షికతో వికీ లీక్స్ విడుదల చేసిన వీడియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇరాక్ దురాక్రమణ యుద్ధంలో ఆ దేశ పౌరులపైన అమెరికా సైనికులు సాగిస్తున్న దారుణ మారణ కాండను ‘కోలేటరల్ మర్డర్’ వీడియో కళ్లకు కట్టింది. ఒక గ్రూపుగా వీధిలో నిలబడి ఉన్న సాధారణ పౌరులను మైలున్నర దూరంలో ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్ గన్ తో అమెరికా సైనికులు కాల్చి చంపిన దృశ్యాన్ని, దారినే పోతున్న…