రష్యా ఎన్నికల నిరసనల వెనుక అమెరికా హస్తం -పుతిన్
రష్యాలో ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా అక్కడ తలెత్తిన నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా ప్రధాని వ్లాదిమిరి పుతిన్ విమర్శించాడు. అమెరికా విదేశాంగ మంత్రి రష్యాలో కొద్దిమంది ప్రతిపక్ష కార్యకర్తలకు ప్రోత్సాహం ఇచ్చిందని పుతిన్ విమర్శించాడు. “ఆమె వారికి ఓ సిగ్నల్ ఇచ్చింది. వారు ఆ సిగ్నల్ విన్నారు. విని తమ పనిని ప్రారంభించారు” అని పుతిన్ విమర్శించాడు. రష్యా ఎన్నికలు సక్రమంగా జరగలేదని అంతర్జాతీయ పరిశీలకులు, రష్యా ప్రతిపక్ష పార్టీలు…