ఉక్రెయిన్: కాల్పుల విరమణపై చర్చిస్తున్న పశ్చిమ దేశాలు?!

జూన్ 3 తో ఉక్రెయిన్ యుద్ధం మొదలై 100 రోజులు గడిచాయి. ఉక్రెయిన్ బలగాలపై రష్యా ఫిరంగి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మెల్లగా అయినప్పటికీ ఉక్రెయిన్ లోని ఒక్కొక్క గ్రామం, పట్టణం రష్యా వశం లోకి వస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ బింకం ప్రదర్శన కూడా కొనసాగుతోంది. ఉక్రెయిన్ కు అమెరికా, ఈయూ ఆయుధ సరఫరా కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘతిస్తున్నాయని ఓవైపు ప్రశంసలు కురిపిస్తున్న అమెరికా, యూకే, ఈయూ లు మరో…

ఇండియా-రష్యా వాణిజ్యంపై అమెరికా సినికల్ దాడి!

అమెరికాతో స్నేహం చేయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకోవడం అని మరోసారి రుజువు అవుతోంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం సందర్భంగా అమెరికా తన వక్ర బుద్ధిని, ఆధిపత్య అహంభావాన్ని, సిగ్గులేనితనాన్ని, మానవత్వ రాహిత్యాన్ని పచ్చిగా, నగ్నంగా, నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఆరు నూరైనా అమెరికా మాట వినాల్సిందే. మనకు ఎంత నష్టం అయినా దాని మాట విని తీరాల్సిందే. ద్రవోల్బణం పెరిగి, నిత్యవసరాల ధరలు పెరిగి భారత ప్రజలు అల్లాడుతున్నా సరే అమెరికా షరతులు…

ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితిపై తప్పుడు వార్తలు

గత నెల రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూ వచ్చింది. ఉక్రెయిన్ తన శక్తి మేరకు ప్రతిఘటన ఇస్తూ వచ్చింది. ఈ యుద్ధం లేదా రష్యా దాడి ఏ విధంగా పురోగమించింది అన్న విషయంలో పత్రికలు ముఖ్యంగా పశ్చిమ పత్రికలు కనీస వాస్తవాలను కూడా ప్రజలకు అందించలేదు. భారత పత్రికలు, ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగు పత్రికలతో సహా పశ్చిమ పత్రికల వార్తలనే కాపీ చేసి ప్రచురించాయి. ద హిందూ, ఇండియన్ ఎక్స్^ప్రెస్, ఎన్‌డి‌టి‌వి మొదలు…

ఇస్తాంబుల్ చర్చలు సఫలం, ఆందోళనలో అమెరికా శిబిరం?

మంగళవారం, మార్చి 29, 2022 తేదీన రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని రష్యా ప్రతినిధి బృందం నేత మెడిన్ స్కీ చేసిన ప్రకటనతో స్పష్టం అయింది. ఈ పరిణామం రష్యా శిబిరంలో సంతోషాతిరేకాలు కలిగిస్తుండగా అమెరికా నేతృత్వంలోని పశ్చిమ శిబిరంలో ఆందోళన, అగమ్యం వ్యక్తం అవుతున్నాయి. నిజానికి చర్చలు సఫలం అయితే పశ్చిమ శిబిరంలోని యూరోపియన్ యూనియన్ కూడా లోలోపల సంతోషిస్తుంది అనడంలో సందేహం లేదు. అమెరికా డిమాండ్, ఒత్తిడిల వల్ల…

శాంతి చర్చలు: విరమణ దిశలో రష్యా ఉక్రెయిన్-దాడి?

ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడి మెల్లగా విరమించే వైపుగా వెళుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా ఇస్తాంబుల్ చర్చల దరిమిలా రష్యా నుండి వెలువడిన ప్రకటనలను బట్టి ఈ అభిప్రాయానికి రావలసి వస్తోంది. టర్కీ నగరం ఇస్తాంబుల్ లో ఇరు పక్షాల మధ్య జరుగుతున్న చర్చలలో ఉక్రెయిన్ నుండి నిర్దిష్టంగా స్పష్టమైన ప్రతిపాదనలు తమకు అందాయని రష్యన్ చర్చల బృందం ప్రకటించింది. “టర్కీ నగరం ఇస్తాంబుల్ లో మార్చి 29 తేదీన జరిగిన చర్చల…

రష్యాపై ఆర్ధిక ఆంక్షలు ఫలిస్తాయా?

ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యాపై సైనికంగా ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్న అమెరికా, నాటో, ఈ‌యూ లు ఆర్ధికంగా రష్యా నాడులు తెంచేందుకు అనేక చర్యలు ప్రకటించాయి. అంతర్జాతీయ చెల్లింపులు, కొనుగోళ్లకు అత్యంత ముఖ్యమైన స్విఫ్ట్ వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించడం దగ్గరి నుండి అధ్యక్షుడు పుతిన్, విదేశీ మంత్రి లావరోవ్ లపై వ్యక్తిగత ఆంక్షలు విధించడం వరకు అనేక ఆంక్షలు అవి విధించాయి. అంతటితో ఆగకుండా ప్రతిరోజూ ఏదో ఒక దేశం, ఏదో ఒక ఆంక్ష…

శాంతి చర్చలకు రష్యా, ఉక్రెయిన్ అంగీకారం

రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించాడు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రతినిధి/ప్రెస్ సెక్రటరీ సెర్గీ నికిఫోరోవ్ శనివారం పత్రికలకు చెప్పాడు. “చర్చలను మేము తిరస్కరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. శాంతి, కాల్పుల విరమణలపై చర్చించడానికి ఉక్రెయిన్ ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నది. ఇది మా శాశ్వత అభిప్రాయం. రష్యన్ అధ్యక్షుడి ప్రతిపాదనను మేము అంగీకరించాం” అని ప్రెస్ సెక్రటరీ తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించాడు (టాస్ న్యూస్ ఏజన్సీ,…

ఆధిపత్యం నిలుపుకునే ఆరాటంలో అమెరికా, బలిపశువు ఉక్రెయిన్!

కొన్ని నెలలుగా ఉక్రెయిన్ కేంద్రంగా అమెరికా రకరకాల యుద్ధ ప్రకటనలు చేస్తున్నది. రష్యా త్వరలో ఉక్రెయిన్ పైన దాడి చేయబోతున్నట్లు గానూ, రష్యా దురాక్రమణ దాడి నుండి ఉక్రెయిన్ ను రక్షించడానికి తన నేతృత్వం లోని నాటో యుద్ధ కూటమి సిద్ధంగా ఉన్నట్లుగానూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటనలు గుప్పిస్తున్నాడు. ఆయనతో పాటు ఇతర అమెరికా అధికారులు కూడా అనుబంధ ప్రకటనలు గుప్పిస్తూ రష్యాను ఒక రాక్షస దేశంగా, ఉక్రెయిన్ ఆ రాక్షసిని చూసి గజ…