రష్యా సేనలు వెనక్కి! అమెరికా జోస్యం తుస్సు?
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి చేయబోతోందంటూ దాదాపు రెండు నెలల నుండి కాకి గోల చేస్తున్న అమెరికా జోస్యం చివరికి తుస్సుమంటోందా? ఈ ప్రశ్నకు సమాధానం ‘అవును’ అని తాజా పరిణామం స్పష్టం చేస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యన్ మిలట్రీ డిస్ట్రిక్ట్ లలో ఉన్న రష్యన్ సైన్యాలు తమ తమ స్థావరాలకు తిరిగి వెళుతున్నాయి. ఈ వార్తను బ్రిటిష్ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. వార్షిక మిలట్రీ డ్రిల్ కోసం అక్కడికి వచ్చిన సైన్యాలు డ్రిల్లు…