మేము దేశం వదిలి వెళ్ళేది లేదు -అమీర్ ఖాన్

రామ్ నాధ్ గోయెంకా జర్నలిజం అవార్డుల ప్రధానోత్సవంలో అమీర్ ఖాన్ చెప్పిన మాటలపై రేగిన రగడ కొనసాగుతోంది. కేంద్ర మంత్రులే స్వయంగా రంగంలోకి దిగి ఖండన మండనలు జారీ చేస్తూ అమీర్ ప్రకటనకు పెడార్ధాలు తీస్తున్న నేపధ్యంలో అమీర్ ఖాన్ మరోసారి స్పందించాడు. తాను చెప్పిందేమిటో పూర్తిగా చదివి మాట్లాడాలని కోరారు. తనకు గానీ, తన భార్యకు గానీ భారత దేశం వదిలి వెళ్ళే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. తప్పుడు అర్ధాలు తీస్తున్నవారు తాను చెప్పిందేమిటో…