రాజన్: గిల్లి జోల పాడుతున్న పాలకులు -విశ్లేషణ
“పొమ్మనలేక పొగబెట్టారు” అని మర్యాదగా చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా బిజేపి పాలకులు రఘురాం రాజన్ పట్ల వ్యవహరించారు. హద్దు పద్దు ఎరగని నోటికి ఓనర్ అయిన సుబ్రమణ్య స్వామి తనపైన అలుపు లేకుండా మొరగటానికి కారణం ఏమిటో, ఆయన వెనుక ఉన్నది ఎవరో తెలియని అమాయకుడా రాజన్? రెండో విడత నియామకం ద్వారా ఆర్‌బిఐ గవర్నర్ పదవిలో కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, అకడమిక్ కెరీర్ పైన దృష్టి పెట్టదలుచుకున్నానని ప్రకటించడం ద్వారా ‘అంత అమాయకుడిని…