స్వామి గొంతు మారింది, బి.జె.పి నోరు జారింది

రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోళ్లపై నిప్పులు చిమ్ముతున్న స్వామి తీరా ఒప్పందం కుదిరి ప్రధాని సంతకం అయ్యాక పాక్షికంగా వెనక్కి తగ్గారు. ప్రధాని గనక ఒప్పందం కుదుర్చుకోవడంలో ముందుకు వెళ్తే కోర్టుకు వెళ్ళడం తప్ప తనకు మరో మార్గం లేదని కూడా ఆయన హెచ్చరించారు. అలాంటిది ఫ్రాన్స్ పర్యటన మొదటి రోజే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే తో కలిసి ‘పడవ పై చర్చ’ జరిపి 36 జెట్లను రెడీగా ఉన్నవి కొనుగోలు చేయాలని ప్రధాని…

పనికిరాని వాహనాల కొనుగోలుకు ఆర్మీ చీఫ్ కి రు.14 కోట్ల లంచం ఆఫర్

600 సబ్ స్టాండర్డ్ వాహనాల కొనుగోలుకు ఆర్మీలోనే ఉన్న మరొక ఉన్నతాధికారి తనకు రు.14 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ వెల్లడించాడు. తనకు లంచం ఇవ్వజూపిన అధికారి ప్రస్తుతం రిటైర్ అయ్యాడని ఆయన తెలిపాడు. సంఘటన జరిగిన వెంటనే ఈ విషయం రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని కి తెలియజేశానని వి.కె.సింగ్ తెలిపాడు. అయితే వి.కె.సింగ్ పత్రికలకు ఈ సంగతి వెల్లడించాక మాత్రమే, సోమవారం, రక్షణ మంత్రి సి.బి.ఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. “ఆరోపణలు…