రామాయణ విషవృక్షం – మతవిమర్శ

(రంగనాయకమ్మ గారి ఉద్గ్రంధాల్లో ఒకటి ‘రామాయణ విషవృక్షం’. ఆ పుస్తకంపై ప్రశంసలు ఎన్నివచ్చాయో, విమర్శలు అన్ని వచ్చాయి. ఆ పుస్తకం వలనే రచయిత్రిపై విద్వేషం పెంచుకున్నవారు అనేకులు. “మతమన్నది, నిజానికి, ఇంకా తనను తాను జయించలేని లేదా తనను తాను మరొకసారి కోల్పోయిన మనిషి యొక్క ఆత్మ-చేతన (self-consciousness) మరియు ఆత్మ-గౌరవం (self-esteem)” అనీ “మతం, ప్రపంచపు ప్రజాదరణ పొందిన రూపంలోని తర్కం. మతం, ప్రపంచపు అత్యాధ్మిక గౌరవాన్ని సమున్నతపరిచే అంశం” అనీ కారల్ మార్క్స్ అభివర్ణించాడు.…

ఇంటిపనికి వేతనం ఇవ్వాల్సింది భర్త కాదు, గృహిణుల శ్రమను దోచే ఆధిపత్య వర్గ ప్రభుత్వం -2

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ట తీర్ధ ఒప్పుకోలు ఇక్కడ పరిగణిచాలి. ఆమె ఒప్పుకున్నది గనుక పరిగణించడం కాదిక్కడ. ఐరాస ఒప్పందం, సుప్రీం కోర్టు పరిశీలన, సామాజిక అధ్యయనవేత్తల లెక్కలు అన్నీ పరిగణిస్తే కృష్ట తీర్ధ ఒప్పుకోలు, పరిగణించవలసిన వాస్తవం అని గ్రహించవచ్చు. మంత్రి ఒప్పుకోలును పరిగణిస్తే భారత దేశ జి.డి.పి 2010 లో 1143 బిలియన్లు కాదు. దాని విలువ 1747 బిలియన్ డాలర్లు. ఇందులో 35 శాతం కేవలం గృహిణుల శ్రమనుండి…

ఇంటిపనికి వేతనం ఇవ్వాల్సింది భర్త కాదు, గృహిణుల శ్రమను దోచే ఆధిపత్య వర్గ ప్రభుత్వం -1

సెప్టెంబర్ మొదటివారంలో అకస్మాత్తుగా దేశ పత్రికలు, చానెళ్ళు వేతనంలేని ఇంటిపని గురించి మాట్లాడడం మొదలు పెట్టాయి. ఇంటి పని చేసినందుకుగాను భర్తల వేతనంలో కొంతభాగం భార్యలకు చెల్లించేలా చట్టం తెస్తామని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ తీర్ధ ప్రకటించడంతో వివిధ వేదికలపైన దేశవ్యాపితంగా చర్చలు మొదలయ్యాయి. మహిళా సంఘాలు, సామాజిక శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్ధల ఎజెండాల్లోనూ, డిమాండ్లలోనూ దశాబ్దాలుగా నలుగుతున్నప్పటికీ, పత్రికల సామాజిక బాధ్యతలో మాత్రం ‘ఇంటిపని వేతనం’ పెద్దగా చోటు సంపాదించలేకపోయింది.…

జానకి విముక్తి – కమ్యూనిస్టులు – కమ్యూనిస్టు ఆచరణ

(గమనిక: ఈ బ్లాగ్ లో ‘జానకి విముక్తి’ నవలపై ఇంతక ముందు రాసిన “రంగనాయకమ్మ గారు – జానకి విముక్తి – మార్క్సిజం” అన్న పోస్టుపై జరిగిన చర్చలో ఇచ్చిన సమాధానం ఇది. దాన్ని పోస్టుగా మార్చాలని ఇచ్చిన సూచన మేరకు కొన్ని మార్పులు చేసి పోస్టు చేయడమైనది) ఒక నవలనుగానీ, పుస్తకాన్ని గానీ చదివినవారు ఎవరైనా అందులో తమకు ఇష్టమైనంతవరకే లేదా అర్ధమైనంతవరకే స్వీకరిస్తారు. నమ్ముతారు కూడా. తమ ఆలోచనా పరిధిలో తర్కించుకుని ‘ఇది బాలేదు’…

రంగనాయకమ్మ గారు – జానకి విముక్తి – మార్క్సిజం

(పుస్తకం బ్లాగ్ లో జానకి విముక్తి నవల పైన సమీక్ష రాశారు. సమీక్షపైన అర్ధవంతమైన చర్చ జరుగుతోంది. అక్కడా కామెంటు రాయడం మొదలుపెట్టి అది కాస్తా ఎక్కువ కావడంతో ఇక్కడ నా బ్లాగ్ లో పోస్టుగా రాస్తున్నా.) “ఒక మంచి డాక్టర్ కావాలంటే ముందు వారు మార్క్సిస్టు అయి ఉండాలి. ఒక మంచి తండ్రి కావాలంటే ముందు మార్కిస్టు అయి ఉండాలి. …” అని రంగనాయకమ్మగారు తన ‘పెట్టుబడి పరిచయం’ పుస్తకం వెనక అట్టమీద రాస్తారు. మార్క్సిజాన్ని…