భావ ప్రకటన స్వేచ్ఛ: క్యూబాకి ఒకటి, అమెరికాకి మరొకటి -కార్టూన్

‘యోవాని సాంఛేజ్’ పశ్చిమ దేశాలకు మహా ఇష్టురాలు. క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి ప్రకటించడం దానికి కారణం. ఆమె ఈ మధ్య ప్రపంచ పర్యటనకి బయలుదేరింది. క్యూబాలో జనం ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆవిడ ప్రచారం చేస్తోంది. యోవాని అసమ్మతిని క్యూబా ప్రభుత్వం సహించలేకపోతోందని, ఆమె భావ ప్రకటనా స్వేచ్చని హరిస్తోందని అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాలు మొత్తుకుంటాయి.  ఆమె అసమ్మతి సహజంగానే పశ్చిమ కార్పొరేట్ పత్రికలలో ప్రముఖ స్ధానం పొందుతోంది. యోవాని భావ ప్రకటన స్వేచ్చ…