స్వామి గొంతు మారింది, బి.జె.పి నోరు జారింది

రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోళ్లపై నిప్పులు చిమ్ముతున్న స్వామి తీరా ఒప్పందం కుదిరి ప్రధాని సంతకం అయ్యాక పాక్షికంగా వెనక్కి తగ్గారు. ప్రధాని గనక ఒప్పందం కుదుర్చుకోవడంలో ముందుకు వెళ్తే కోర్టుకు వెళ్ళడం తప్ప తనకు మరో మార్గం లేదని కూడా ఆయన హెచ్చరించారు. అలాంటిది ఫ్రాన్స్ పర్యటన మొదటి రోజే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే తో కలిసి ‘పడవ పై చర్చ’ జరిపి 36 జెట్లను రెడీగా ఉన్నవి కొనుగోలు చేయాలని ప్రధాని…

యెమెన్ నిరసనకారులపై పోలీసుల కాల్పులు, ఆరుగురు మృతి

ట్యునీషియా విప్లవం స్ఫూర్తితో యెమెన్ రాజుకు వ్యతిరేకంగా వారాల తరబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పాటిస్తున్న ఉద్యమకారులపై  మార్చి 12 తేదీన పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని చంపేశారు. 1250 మంది గాయపడ్డారనీ 250 మంది తీవ్రంగా గాయపడ్డారనీ డాక్టర్లు తెలిపారు. రాజధాని సనా లో ప్రజాస్వామిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ యెమెన్ ప్రజలు అనేక వారాలనుండి “విమోచనా కూడలి” లో నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. 32 సంవత్సరాలనుండి అధికారంలో ఉన్న యెమెన్ అధ్యక్షుడు…

అల్జీరియా, యెమెన్ లలో ప్రదర్శకులను చెదరగొట్టిన ప్రభుత్వాలు

ఈజిప్టులో ప్రజాందోళనల ధాటికి తలొగ్గి ముబారక్ అధికారం త్యజించటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అల్జీరియా, యెమన్ ల పౌరులు తమ నియంతృత్వ ప్రభువులు సైతం దిగి పోవాలని డిమాండ్ చేస్తూ ఆయా రాజధానుల్లో శనివారం  ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ముందునుండే అప్రమత్తతతో ఉన్న అక్కడి ప్రభుత్వాలు పోలీసులు, సైన్యాలతొ పాటు తమ మద్దతుదారులను కూడా ఉసిగొల్పి ప్రదర్శనలు పురోగమించకుండా నిరోధించ గలిగింది. “బౌటెఫ్లికా వెళ్ళిపో” -అల్జీరియా ప్రదర్శకులు అల్జీరియా రాజధాని అల్జీర్స్ లో మొహరించి ఉన్న పోలీసులకు భయపడకుండా…