యెమెన్ లో సౌదీ యుద్ధాన్ని ఆపండి! -ద హిందూ..

[Stop the Saudis war in Yemen సంపాదకీయానికి (అక్టోబర్ 13, 2016) యధాతధ అనువాదం.] *** యెమెన్ లో 18 నెలలుగా సౌదీ అరేబియా సాగిస్తున్న మిలటరీ ఆపరేషన్, జనావాస కేంద్రాలపై దాడులతోనూ, మూకుమ్మడి చావుల తోనూ నిండిపోయింది. ఇటీవలి ప్రమాణాల ప్రకారం చూసినా కూడా సనాలో సంతాపం కోసం జనం చేరిన హాలుపై అక్టోబర్ 8 తేదీన, 140 మంది మరణానికీ 500 కు పైగా గాయపడేందుకూ -వారిలో అనేకమంది పౌరులు- దారి తీసేట్లుగా…

యెమెన్ పై అమెరికా మిసైల్ దాడి, ఆత్మరక్షణ కోసం(ట)!

  ఎర్ర సముద్రంలో తిష్ట వేసిన మూడు అమెరికా యుద్ధ నౌకలు ఈ రోజు (గురువారం, అక్టోబర్ 13) యెమెన్ పైన క్షిపణి దాడి చేశాయి. యెమెన్ కు చెందిన రాడార్ నిర్వహణ స్ధలాలను లక్ష్యం చేసుకుని అమెరికా మిలట్రీ ఈ దాడులు చేసింది దాడిలో మూడు రాడార్ నిర్వహణ వసతులు ధ్వంసం అయ్యాయని అమెరికా సగర్వంగా చాటింది.  అమెరికా దాడులకు కారణం?  ఆత్మ రక్షణ! యెమెన్ చాలా చిన్న దేశం. అత్యంత పేద దేశం. సహజ…

యెమెన్ నెత్తుటి చెరువు అమెరికా బాంబుల ఫలమే!

చనిపోయిన తమ నేత అంతిమ యాత్ర నిమిత్తం ఒక హాలులో గుమి కూడిన ప్రజలపై సౌదీ అరేబియా జరిపిన వైమానిక బాంబు దాడిలో 140 నుండి 200 వరకు మరణించిన సంగతి విదితమే. “నెత్తుటి చెరువు’ గా అభివర్ణించబడుతున్న ఈ మారణకాండలో సౌదీ మిలట్రీ, అమెరికా సఫరఫరా చేసిన MK-82 గైడెడ్ మిసైల్ లను ప్రయోగించినట్లు తాజాగా సాక్షాలు వెలువడ్డాయి. దానితో సౌదీ పాపంలో అమెరికా నేరుగా భాగం పంచుకున్నదని వెల్లడి అయింది. సౌదీ దాడి అనంతరం…

యెమెన్: అంతిమ యాత్రపై సౌదీ దాడి, 200 మంది దుర్మరణం

  మధ్య ప్రాచ్యం / పశ్చిమాసియా లో అమెరికా అనుంగు మిత్ర దేశం సౌదీ అరేబియా యెమెన్ లో సామూహిక హాత్యాకాండలకు పాల్పడుతోంది. తనకు వ్యతిరేకంగా మారినందుకు, అమెరికాను కూడా తలదన్నుతూ, ఒకటిన్నర సం.ల క్రితం యెమెన్ పై ఏకపక్ష యుద్ధం ప్రకటించిన సౌదీ అరేబియా ఆ దేశంలో అనేక అరాచకాలకు, యుద్ధ నేరాలకు, ఉచకోతలకు పాల్పడుతున్నది. తాజా ఊచకోత సౌదీ అరేబియా సాగించిన అనేక దారుణాల్లో ఒకటి మాత్రమే.  తిరుగుబాటు గ్రూపుకు చెందిన ఇంటీరియర్ మినిష్టర్…