ఐనోళ్ళకు పూలు, కానోళ్లకు రాళ్ళు! -కార్టూన్
అవినీతికి తర తమ బేధాలు ఉంటాయి! అలాగని బిజేపి అధ్యక్షులు అమిత్ షా చెప్పదలిచారు. లేకపోతే ఓ వంక యెడ్యూరప్పను మళ్ళీ కర్ణాటక బిజేపి అధ్యక్షుడిని చేస్తూ మరో వంక తమిళనాడు ప్రభుత్వాన్ని అత్యంత అవినీతి ప్రభుత్వంగా తిట్టిపోయడం ఎలా సాధ్యపడుతుంది? యెడ్యూరప్ప వ్యవహారం తెలియనిదేమీ కాదు. అవినీతి ఆరోపణలతో ఆయనను తప్పించినందుకు పార్టీని చీల్చి వేరే పార్టీ పెట్టుకున్నారాయన. బిజేపి ఓట్ల చీలికతో, అనంతరం కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం, అధికారం…