యెడ్యూరప్ప కొత్త పార్టీకి బి.జె.పి ఆక్సిజన్ -కార్టూన్
అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన కర్ణాటక బి.జె.పి నాయకుడు యెడ్యూరప్ప కొత్త ప్రాంతీయ పార్టీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు యెడ్యూరప్ప ప్రకటించినప్పటికీ ఆయనను బహిష్కరించలేని పరిస్ధితి బి.జె.పిది. బి.జె.పి ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలేదని యెడ్యూరప్ప ప్రకటించినందుకే బి.జె.పి ఆయన పట్ల కృతజ్ఞతతో పడి ఉంటోంది. అలా కాదని ధైర్యం చేసి బెహిష్కరిస్తే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. దానితో యెడ్యూరప్ప పార్టీలో ఉంటూనే కొత్త పార్టీ పనులను చక్కబెట్టుకునే అపూర్వ అవకాశం యెడ్యూరప్పకి…