గ్రీసు దివాలాకు యూరప్ ఏర్పాట్లు?

ఋణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐరోపా రాజ్యాలు గ్రీసు దివాలా తీసే పరిస్ధితికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యూరో జోన్ (యూరోను ఉమ్మడి కరెన్సీగా కలిగి ఉన్న 17 ఈ.యు సభ్య దేశాల సమూహం) నాయకురాలైన జర్మనీ ఆర్ధిక మంత్రి ఈ మేరకు తగిన సూచనలు ఇస్తున్నట్లు వాణిజ్య పత్రికలు, పరిశీలకులు భావిస్తున్నారు. గ్రీసు తన జాతీయ కరెన్సీ డ్రాక్మాను రద్దు చేసుకుని యూరోను తమ కరెన్సీగా స్వీకరించిన దేశాల్లో ఒకటి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం…

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపాయే పెద్ద ప్రమాదం -ఒ.ఇ.సి.డి

ఒ.ఇ.సి.డి = ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డవలప్ మెంట్ ఒ.ఇ.సి.డి అర్ధ వార్షిక సమావేశాలు బుధవారం పారిస్ లో జరిగాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపా పెద్ద ప్రమాదంగా పరిణమించిందని ఈ సమావేశాల్లో సంస్ధ సమీక్షించింది. 34 ధనిక దేశాల కూటమిలో 24 దేశాలు ఐరోపాకి చెందినవే కావడం గమనార్హం. ఐరోపా ఆర్ధిక బలహీనత మరింత కాలం కొనసాగితే అది ఆర్ధిక స్తంభనకు దారి తీసి మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకే ముప్పుగా పరిణమిస్తుందని…

రికార్డులు తిరగ రాస్తున్న యూరోజోన్ నిరుద్యోగం

17 ఐరోపా దేశాల మానిటరీ యూనియన్ ‘యూరోజోన్’ నిరుద్యోగంలో తన రికార్డులు తానే తిరగ రాస్తోంది. ఉమ్మడి యూరో కరెన్సీ ఉనికిలోకి వచ్చిన గత 13 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా 12 శాతం నిరుద్యోగాన్ని నమోదు చేసింది. జనవరిలో 11.9 శాతంగా ఉన్న నిరీద్యోగ శాతం మరో 33,000 మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఫిబ్రవరిలో 12 శాతానికి పెరిగింది. ఐరోపా వ్యాపితంగా అధికారిక నిరుద్యోగుల సంఖ్య 1.91 కోట్లకు పై చిలుకేనని ఐరోపా గణాంక సంస్ధ…

రికార్డు స్ధాయికి యూరో జోన్ నిరుద్యోగం, డబుల్ డిప్ నిర్ధారణ?

ఫిబ్రవరి నెలలో 17 దేశాల యూరో జోన్ నిరుద్యోగం అత్యధికంగా 10.8 శాతానికి చేరుకుంది. 1999 లో ‘యూరో’ ఉమ్మడి కరెన్సీగా యూరో జోన్ ఏర్పాడ్డాక ఇదే అత్యధిక స్ధాయి నిరుద్యోగం. జనవరి నెలలో యూరో జోన్ 10.6 శాతం నిరుద్యోగం నమోదు చేసింది. యూరో జోన్ దేశాల్లోలో స్పెయిన్ అత్యధికంగా 23.6 శాతం నిరుద్యోగంతో అగ్రస్ధానంలో ఉంది. మూడేళ్ళ క్రితం సంభవించిన ‘ది గ్రేట్ రిసెషన్’ నుండి పూర్తిగా కోలుకోక ముందే యూరప్, మరోసారి మాంద్యంలోకి…