యూరోజోన్ విచ్ఛిన్నం ప్రారంభం, గ్రీసును సాగనంపడానికి ప్రయత్నాలు

12 సంవత్సరాల వయసులోనే యూరోజోన్ విచ్ఛిన్నం అనివార్యంగా మారింది. ఎంతో అట్టహాసంతో, మరెన్నో ఆశలతో ప్రారంభమైన యూరోజోన్ మానిటరీ యూనియన్ ఆర్ధిక సంక్షోభాల ధాటికి పన్నెండో సంవత్సరంలోనే విచ్ఛిన్నానికి దగ్గరయ్యింది. ప్రపంచ దేశాలకు ఉమ్మడి కరెన్సీగా, అందరూ కోరుకునే అంతర్జాతీయ మారక కరెన్సీగా డాలర్ చెలాయిస్తున్న ఆధిపత్యానికి గండికొట్టి పోటీగా ఎదగడానికి ఏర్పాటు చేసుకున్న యూరో కరెన్సీ తన లక్ష్యాన్ని సాధించకపోగా అప్పుడే ఒక సభ్య దేశాన్ని సాగనంపడానికి సిద్ధపడుతోంది. యూరో గ్రూపు రాజకీయ నాయకుడుగా ఉన్న…

సొరంగం చివర వెలుగును చూస్తున్న యూరో -కార్టూన్

అమెరికా ఆధిపత్యానికి దీటుగా ఎదగాలన్న ఆకాంక్షతో యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్ (ఇ.యు) ఏర్పాటు చేసుకున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించి పైచేయి సాధించాలన్న కోరికతో ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ అవి ఏర్పాటు చేసుకున్నాయి. ఇ.యులో 25 దేశాలను ఆకర్షించగలిగినా, యూరోజోన్ లోకి 17 దేశాలను ఆకర్షితులయ్యాయి. యూరో జోన్ వలన చాలా వరకు దేశీయ ద్రవ్య, ఆర్ధిక, పన్నుల చట్టాలను రద్దు చేసుకోవడంతో జర్మనీ, ఫ్రాన్సు లాంటి పెద్ద దేశాలే వీటినుండి లబ్ది పొందగలుగుతున్నాయి. కాని బలహీన…

జి7, యూరోజోన్‌ల వైఫల్యంతో ప్రపంచ స్ధాయిలో షేర్ల పతనం

శుక్రవారం జరిగిన జి7 గ్రూపు దేశాల సమావేశం యూరోజోన్ సంక్షోభం పరిష్కారానికి ఏ విధంగానూ ప్రయత్నించకపోవడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. యూరోజోన్ దేశాల్లో, ముఖ్యంగా జర్మనీకీ ఇతర దేశాలకీ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడం కూడా షేర్ మార్కెట్లపై ప్రపంచ స్ధాయి ప్రభావం పడుతోంది. జపాన్ షేర్ మార్కెట్ నిక్కీ గత రెండున్నర సంవత్సరాలలోనే అత్యల్ప స్ధాయికి పడిపోయింది. భారత షేర్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచి మళ్ళీ పదాహారు వేల పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,…

కొత్త ప్రమాదం ముంగిట ప్రపంచ మార్కెట్లు -ప్రపంచ బ్యాంకు

గత కొద్ది వారాలుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచ మార్కెట్లను కొత్త ‘డేంజర్ జోన్’ ముంగిట నిలిపాయని ప్రపంచ బ్యాంకు అధిపతి రాబర్ట్ జోయెలిక్ హెచ్చరించాడు. 1. అమెరికా, యూరప్ ల లాంటి కీలక దేశాల్లో ఆర్ధిక నాయకత్వంపై మార్కెట్ విశ్వాసం సన్నగిల్లడం, 2. పెళుసైన ఆర్ధిక రికవరీ… ఈ రెండు అంశాలు కలిసి మార్కెట్లను కొత్త ప్రమాదంలోకి నెట్టాయని ఆయన వ్యాఖ్యానించాడు. వివిధ దేశాల్లోని విధాన కర్తలు దీనిని తీవ్రంగా పరిగణించాలని జోయెలిక్ కోరాడు. సిడ్నీలో ఆదివారం…

ప్రజాందోళనల నడుమ కోతలు, రద్దుల బిల్లుని ఆమోదించిన గ్రీసు పార్లమెంటు

గ్రీసు ప్రభుత్వం తన ప్రజలపై ఆమానుషంగా ఆర్ధిక దాడులకు తెగబడే బిల్లుని ఆమోదించింది. ప్రవేటు, ప్రభుత్వ రంగాలలోని కార్మికులు, ఉద్యోగులు మంగళ, బుధవారాల్లో 48 గంటల సమ్మెను నిర్వహించినా, పార్లమెంటు బయట విరసనకారులు పోలీసులతో తలపడినా గ్రీసు ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకు పోయింది. 155 – 138 ఓట్ల తేడాతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పొదుపు చర్యల బిల్ల ను పార్లమెంటు ఆమోదంచింది. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు అప్పు ఇస్తున్న సందర్భంగా విధించిన…

ఇంగ్లండు పర్యటనలో చైనా ప్రధాని, వ్యాపారం పెంపుకు హామీ

ఐదు రోజుల పర్యటన నిమిత్తం యూరప్ వచ్చిన చైనా ప్రధాని వెన్ జియాహావో సోమవారం నుండి ఇంగ్లండు లో పర్యటిస్తున్నాడు. తన పర్యటన సందర్భంగా వెన్ “ఇంగ్లండుతో ద్వైపాక్షిక వ్యాపారం మరింతగా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. మరిన్ని బ్రిటన్ ఉత్పత్తులు చైనాకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇంగ్లండులోని చైనా కార్ల కంపెనీ ఎం.జి కార్ ప్లాంటు తయారు చేస్తున్న మోడల్‌ని మరిన్ని ఎంటర్‌ప్రైజ్‌లు ఆధారంగా చేసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచాడు. సంక్షోభంలో యూరోజోన్ దేశాలకు మద్దతు కొనసాగిస్తామని…

యూరోజోన్ వడ్డీ రేట్లు పెంచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు

ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మొట్టమొదటి సారిగా వడ్డీ రేట్లను పెంచింది. సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు, యూరోజోన్ దేశాల ఆర్ధికవృద్ధి, సంక్షోభ పరిస్ధుతులను అధిగమిస్తున్న విషయాన్ని సూచిస్తోంది. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కడానికి ప్రపంచ దేశాలు తమ సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్లను అతి తక్కువ స్ధాయిలో ఉంచి తద్వారా మార్కెట్ కు డబ్బు అందుబాటులో ఉంచాయి. మార్కెట్ కు డబ్బు అధికంగా అందుబాటులో…

కూలిపోయే దిశలో పోర్చుగల్ ప్రభుత్వం

యూరప్ అప్పు సంక్షోభం మళ్ళీ జడలు విప్పుతోంది. తాజాగా అది పోర్చుగల్ ను బలి కోరుతోంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు), ఐ.ఎం.ఎఫ్ లనుండి బెయిలౌట్ తీసుకోవడానికి వ్యతిరేస్తున్న సోషలిస్టు ప్రభుత్వం ప్రతిపాదించిన పొదుపు చర్యలను పార్లమెంటు వ్యతిరేస్తుండడంతో పోర్చుగల్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. గురువారం జరగనున్న ఇ.యు సమావేశం నాటికి పొదుపు చర్యల బిల్లును ఆమోదించుకుని వెళ్ళాలన్న ప్రధాన మంత్రి “జోస్ సోక్రటీస్” ఆశల్ని వమ్ము చేస్తూ, సోషల్ డెమొక్రట్ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నది. “బిల్లు…