క్లుప్తంగా… 02.05.2012

జాతీయం   రిలయన్స్ ని అధిగమించిన టాటా కన్సల్టెన్సీ బుధవారం షేర్ మార్కెట్లు ముగిసేనాటికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ (టి.సి.ఎస్) అత్యధిక విలువ గల కంపెనీగా అవతరించింది. ‘మార్కెట్ క్యాపిటలైజేషన్’ ప్రకారం ఇప్పుడు టి.సి.ఎస్ అతి పెద్ద కంపెనీ. గత అయియిదేళ్లుగా రిలయన్స్ కంపెనీ ఈ స్ధానంలో కొనసాగుతూ వచ్చింది. బుధవారం ట్రేడ్ ముగిసేనాటికి టి.సి.ఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రు. 2,48,116 కోట్లు కాగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రు. 2,43,413 కోట్లు. బుధవారం ఆర్.ఐ.ఎల్…

రికార్డు స్ధాయికి యూరోజోన్ నిరుద్యోగం

17 దేశాల యూరో జోన్ లో నిరుద్యోగం రికార్డు స్ధాయికి చేరుకుంది. జనవరి నాటికి ఈ దేశాల నిరుద్యోగం 10.7 శాతం ఉందని యూరో స్టాట్ సంస్ధ వెల్లడించింది. యూరో జోన్ దేశాల్లోని కంపెనీలు డిసెంబరులో మరో 1,85,000 ఉద్యోగాలు రద్దు చేశాయని గణాంకాలు చెపుతున్నాయి. యూరప్ ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బుని బిలియన్ల కొద్దీ బెయిలౌట్లుగా మేసిన కార్పొరేట్ కంపెనీలు ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడినప్పటికీ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు మరిన్ని  ఉద్యోగాలు…