ఈ.యుకు సమాధానం యూరేసియన్ యూనియన్ రెడీ!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దశాబ్దం నాటి కల నెరవేరుతోంది. చరిత్రాత్మక ఒప్పందం కుదరడంతో రష్యా మీది మీదికి వస్తున్న నాటో-ఇ.యు-అమెరికా కు గట్టి సమాధానంగా యూరేసియన్ యూనియన్ ప్రపంచ భౌగోళిక-రాజకీయ చిత్రపటం పైకి దూసుకొస్తోంది. రష్యా, కజకిస్తాన్, బెలారస్ దేశాల నేతలు ఆస్తానాలో సమావేశమై పూర్తిస్ధాయి ఆర్ధిక కూటమి (యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ -ఇ.ఇ.యు) ఏర్పాటు చేస్తూ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం మేరకు ఇప్పటిదాకా ఉన్న కస్టమ్స్ యూనియన్, జనవరి 1, 2015 నుండి యూరేసియన్…

రష్యా అదుపులో క్రిమియా, నీతులు వల్లిస్తున్న అమెరికా

ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రమై సైనిక జోక్యం వరకు వెళ్లింది. రష్యా, పశ్చిమ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే స్ధితికి చేరింది. యూరోపియన్ యూనియన్ లో చేరడానికి నిరాకరించినందుకు అమెరికా, ఐరోపాలు ఉక్రెయిన్ లో హింసాత్మక చర్యలు రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఆందోళనలు చివరికి అధ్యక్షుడు యనుకోవిచ్ ను దేశం విడిచి వెళ్లిపోయేలా చేశాయి. అనంతరం ఇ.యు, అమెరికా అనుకూల శక్తులు, నాజీ తరహా జాతీయ విద్వేష పార్టీలు ప్రభుత్వ కార్యాలయాలను, పార్లమెంటును స్వాధీనం చేసుకున్నాయి.…

ఉక్రెయిన్: రష్యా వైపా, ఇ.యు వైపా?

యూరోపియన్ యూనియన్ లో చేరడాన్ని ఉక్రెయిన్ వాయిదా వేయడంతో ఇప్పుడక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున రాజధానికి తరలి వచ్చి ఇ.యు లో చేరాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఇ.యులో చేరడాన్ని నిరాకరిస్తున్న అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ దేశాలకు అనుకూలంగా వ్యవహరించే మూడు ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలో ఈ ఆందోళనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లర్లకు పాల్పడినవారిని పోలీసులు అరెస్టు చేయగానే అమెరికా, ఐరోపాల ప్రభుత్వాలు, పత్రికలు ‘మానవ హక్కులు’ అంటూ కాకి…