యూరోప్ లైఫ్ బోట్ కి వళ్ళంతా చిల్లులే -కార్టూన్

ఎడ తెగని గ్రీసు రుణ సంక్షోభం యూరపియన్ యూనియన్ ఓడను ముంచేస్తోంది. గ్రీసు కోసం ఇ.యు నాయకులు రక్షణ నిధి ని ప్రకటించినప్పటికీ అది గ్రీసు ను కాపాడుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఈ లోపు ఇటలీ కూడా రుణ సంక్షోభంలో దూకడానికి సిద్ధంగా ఉంది. రుణ సంక్షోభం యూరప్ దేశాల ప్రభుత్వాలను కూలుస్తోంది. ఇటలీలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. గ్రీసు ప్రధాని రాజీనామాకి రంగం సిద్ధమైంది. ఎన్నికలూ జరగనున్నాయి. ఇటలీ ప్రధాని…

మీ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాలి -యూరప్ తో చైనా

యూరప్ దేశాలు తమ రుణ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సోమవారం చైనా హెచ్చరిక లాంటి కోరిక కోరింది. యూరో జోన్ దేశాలు రుణ సంక్షోభంతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గ్రీసుకు గత సంవత్సరం బెయిలౌట్ పేరుతో ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా రుణ ప్యాకేజి ప్రకటించి దశలవారీగా ఇస్తున్నాయి. ఈ లోపు గ్రీసు దేశంపైన విషమ షరతులను విధించింది. ఒక్కో రుణ వాయిదా అందుకోవడానికి కొన్ని షరతులు విధించి అవి అమలు చేస్తేనే ఒక్కొక్క వాయిదా…

సంక్షోభ పరిస్ధితుల్లో దిక్కు తోచని సంపన్నులు

యూరప్ రుణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వృద్ధి స్తంభనలు ప్రపంచ సంపన్నులను గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తమ సంపదలను ఎక్కడ మదుపు చేస్తే క్షేమంగా ఉంటుందో అంచనా వేయలేక సతమతమవుతున్నారు. ఎల్లప్పుడూ తమ సంపదలను వృద్ధి చేసుకోవడానికి ఎత్తులు పైఎత్తులలో మునిగి తేలుతూ ఉండే వాళ్ళు ఇప్పుడు వృద్ధి సంగతి అటుంచి అవి తరిగిపోకుండా ఉండడానికి గల మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు అప్పుడే వినాశకకర పరిస్ధితులో పెట్టుబడులను ఎక్కడికి తరలిస్తారో గమనించి అటువంటి చోట్లను వెతుకులాడుతున్నారు. డబ్బు…

అమెరికా, యూరప్ సంక్షోభాలకు పరిష్కారం చూపని జి7 సమావేశాలు

శుక్రవారం జరిగిన జి7 సమావేశాలు చప్పగా ముగిశాయి. ప్రపంచ ఆర్ధికవ్యవస్ధ మరొక మాంద్యం ముంగిట నిలబడి ఉన్నప్పటికీ ఇతమిద్ధమైన పరిష్కారారాన్నేదీ చూపలేకపోయింది. అందరం కలిసి ఉమ్మడి సహకారంతో సంక్షోభానికి స్పందించాలన్న మొక్కుబడి ప్రకటన తప్ప సమావేశాలు ఏమీ సాధించలేకపోయాయి. పైగా యూరప్ రుణ సంక్షోభంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి నిరాశపరిచాయి. యూరప్ రుణ సంక్షోభం పరిష్కారానికి యూరోప్ కి చెందిన శక్తివంతమైన దేశాలు యూరోజోన్ లోని బలహీన దేశాలకు ద్రవ్య మద్దతు ఇవ్వాలని అమెరికా నొక్కి చెప్పగా,…

ఆసియా ఆర్ధిక వ్యవస్ధలని కిందికి లాగుతున్న అమెరికా, యూరప్‌ల సంక్షోభాలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి మాంద్యంలోకి జారే అవకాశాలు కనిపిస్తున్నాయని సింగపూర్ ఆర్ధిక మంత్రి మంగళవారం జోస్యం చెప్పాడు. మాంద్యం సంభవించకుండా ఉండడం కంటే సంభవించడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నాడు. చైనా ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) గత పది సంవత్సరాలలోనే అత్యంత తక్కువ నమోదు చేయవచ్చని చైనా అధికారి ఒకరు వేరే సందర్భంలో తెలిపాడు. ఏసియాన్ దేశాల కూటమి ద్రవ్య విధానం సమీక్ష కోసం రానున్న శుక్రవారం సమావేశం కానున్నాయి. అమెరికా,…

గ్లోబల్ రికవరీకి ప్రమాదం పొంచి ఉంది, వెంటనే చర్యలు తీసుకొండి -ఐ.ఎం.ఎఫ్

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ఐ.ఎం.ఎఫ్ ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. మూడు సంవత్సరాల క్రితం ఏర్పడిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం నుండి కుంటుతూ కోలుకుంటున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి సంక్షోభంలో జారిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. వెంటనే చర్యలు తీసుకుంటే తప్ప దాన్ని అరికట్టలేమని ఐ.ఎం.ఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్ట్రీన్ లాగార్డే తెలియజేసింది. “ఈ వేసవిలో జరిగిన పరిణమాలు, మనం ప్రమాదకరమైన కొత్త దశలో ఉన్నమాని సూచిస్తున్నాయి. బలహీనంగా ఉన్న ఆర్ధిక రికవరీ…

“అప్పు” పై యుద్ధంలో అమెరికా, యూరప్ లకు చైనా సహాయం -కార్టూన్

యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా రుణ సంక్షోభంలో ఉన్న సంగతి విదితమే. యూరోపియన్ రుణ సంక్షోభం ఫలితంగా గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు దివాలా అంచుకు చేరాయి.స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్సులు సంక్షోభం బాటలో ఉన్నాయి. బ్రిటన్, జర్మనీల పరిస్ధితి కూడా ఏమంత ఘనంగా లేదు. ఇటీవల యూరప్ పర్యటించిన చైనా ప్రధాని, రుణ సంక్షోభం నుండి బైటికి రావడానికి సహాయం చేయడానికి చైనా రెడీ అని హామీ ఇచ్చాడు. అమెరికా అప్పులో దాదాపు రెండు ట్రిలియన్ల వరకు…

స్పెయిన్ రుణ సంక్షోభం, పొదుపు చర్యలకు బలౌతున్న జనం -కార్టూన్

యూరో జోన్ లో (యూరోను కరెన్సీగా అంగీకరించిన యూరప్ దేశాలు) రుణ సంక్షోభంలో ఉన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. సంక్షోభాన్ని ఎదుర్కొనే పేరుతో అక్కడి ప్రభుత్వం ప్రజలపై పొదుపు బడ్జెట్ నీ, పొదుపు ఆర్ధిక విధానాలనీ ప్రజలపై రుద్ధుతోంది. ఇప్పటికే సగం చచ్చి ఉన్న కార్మికులు, ఉద్యోగులపై మరిన్ని కోతలు, రద్దులు ప్రకటించడంతో వారి కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. బ్యాంకులు, కంపెనీలకు పన్నుల రాయితీలు కొనసాగిస్తూ, వీలతై మరిన్ని రాయితీలిస్తూ, ప్రజలపైన పన్నులు బాదుతున్నారు. ఇది…

ఫ్రాన్సును తాకిన యూరప్ రుణ సంక్షోభం, యూరోజోన్ ఉనికికే వచ్చిన ప్రమాదం

యూరోజోన్ గ్రూపుకి ఉన్న రెండు ప్రధాన స్తంభాల్లో ఒకటైన ఫ్రాన్సును రుణ సంక్షోభం తాకింది. ఫ్రాన్సు తన క్రెడిట్ రేటింగ్ AAA రేటింగ్ ని కోల్పోవచ్చన్న ఊహాగానాలు రాను రానూ బలంగా మారుతున్నాయి. మూడు ప్రధాన క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఫిచ్, ఎస్&పి, మూడీస్ లు ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ కి ఇప్పుడప్పుడే వచ్చిన ప్రమాదం ఏమీ లేదని హామీ ఇస్తున్నప్పటికీ మార్కెట్లు వినిపించుకునే స్దితిలో లేనట్లు కనిపిస్తున్నది. లండన్ అల్లర్లకు బ్రిటన్ ప్రధాని కామెరూన్ తన…

భారీ నష్టాల్లో షేర్ మార్కెట్, శుక్రవారం 400 పాయింట్ల పైగా పతనం

ఈ వారం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. వ్యాపారం ప్రారంభమైన గంటలోపే 400 పాయింట్లకు పైగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ నష్టపోయింది. ఇది దాదాపు 2.4 శాతానికి సమానం. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 2.4 శాతం నష్టపోయి 17,268 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్.ఎస్.ఇ నిఫ్టీ కూడా 2.4 శాతం నష్టపోయి 5204 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్, ఇటలీలకు పాకవచ్చునని అనుమానాలు విస్తృతం కావడం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరోసారి…