యూరోజోన్ సంక్షొభం భయాలతో కుప్పకూలిన భారత షేర్మార్కెట్లు
యూరప్ అప్పు సంక్షోభం భయాలు విస్తరించడంతో ప్రపంచ వ్యాపితంగా సోమవారం నాడు షేర్ మార్కెట్లు వణికిపోతున్నాయి. భారత షేర్ మార్కెట్లు దాదాపు రెండు శాతం నష్టపోయాయి. గ్రీసు అప్పు రేటింగ్‌ను ఫిచ్ రేటింగ్ సంస్ధ బాగా తగ్గించడం, ఇటలీ అప్పు రేటింగ్‌ను ఎస్ & పి రేటీంగ్ సంస్ధ నెగిటివ్ కి తగ్గించడంతో షేర్ మార్కెట్లలో అమ్మకాల వత్తిడి పెరిగింది. రేటింగ్ సంస్ధల చర్యలతో యూరో విలువ తగ్గింది. ఇప్పటికే గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు అప్పు…