నోట్ల రద్దు: రాజకీయ ప్రయోజనాలు సాధిస్తాం -బీజేపీ
పెద్ద నోట్ల రద్దు వెనుక బీజేపీ లక్ష్యాలు తెర వెనుక నుండి మెల్లగా బైటికి వస్తున్నాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నల్ల ధనం, ఉగ్రవాదం, దొంగ నోట్లు, మున్నగు జబ్బుల్ని నయం చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేశామని మోడీ చెబుతుండగా ‘నోట్ల రద్దు’ వల్ల వచ్చే ప్రతిష్టను ఓట్ల కోసం వినియోగించుకుంటామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. “మేము రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం. భజన బృందం నడపడం లేదు. భజన పాటలు…